News November 6, 2025
నాగర్ కర్నూల్: ఈనెల 15న లోక్ అదాలత్

నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో కేసుల పరిష్కారానికి ఈనెల 15వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రెటరీ నసీమ సుల్తానా తెలిపారు. పోలీసు అధికారులు వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ అయ్యే విధంగా చూడాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారంతో అప్పీల్ లేని తీర్పును పొందవచ్చన్నారు.
Similar News
News November 6, 2025
20న తిరుపతికి రాష్ట్రపతి

AP: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 20, 21 తేదీల్లో తిరుపతిలో పర్యటించనున్నారు. 20న తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఆమె దర్శించుకుంటారు. 21న తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అదేరోజు శ్రీ వరాహస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News November 6, 2025
సిరిసిల్ల: ‘రవాణా చేసినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవు’

గంజాయి రవాణా చేసినా, అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ నటేశ్ అన్నారు. సిరిసిల్ల పరిధిలోని పాన్ షాప్, లాడ్జిలో గురువారం పోలీస్ జాగిలాలతో తనిఖీ నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనేని లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి అమ్మినా, తాగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 6, 2025
రాహుల్ ఆరోపించిన చోట కాంగ్రెస్‌కే అధిక ఓట్లు

హరియాణాలో భారీగా ఓటు చోరీ జరిగిందని నిన్న LoP రాహుల్ గాంధీ ECపై ఆరోపణలు గుప్పించడం తెలిసిందే. ములానా సెగ్మెంటు ఢకోలా గ్రామంలో ఒకే ఫొటో (బ్రెజిలియన్ మోడల్)తో 223 ఓట్లున్నట్లు చూపారు. అయితే 2024 పోలింగ్‌లో అక్కడ CONGకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో BJPకి 275, CONGకు 602 ఓట్లు రాగా లోక్‌సభలో BJP కన్నా CONGకు 392 ఓట్లు ఎక్కువొచ్చాయి. 2019తో పోలిస్తే 2024లో కాంగ్రెస్‌కే అధిక ఓట్లు పడ్డాయి.


