News April 8, 2025
నాగర్ కర్నూల్ కలెక్టర్ కీలక సూచన

వేసవి తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం 12గంటల నుంచి 3గంటల వరకు ప్రజలు ఎవరు బయట తిరగొద్దని కలెక్టర్ బధావత్ సంతోష్ సూచించారు. వైద్య ఆరోగ్య అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు వడదెబ్బ బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News April 8, 2025
HYD: హైడ్రా ప్రజావాణికి 57 ఫిర్యాదులు

HYDలోని హైడ్రా కార్యాలయంలో ఈరోజు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణిలో భాగంగా 57 ఫిర్యాదులు వచ్చినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ పూర్తైతే చాలా సమస్యలకు పరిష్కారం దొరకుతుందని, ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News April 8, 2025
సత్తెనపల్లిలో విద్యార్థిని ఆత్మహత్య

బీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సత్తెనపల్లికి చెందిన మాజీ కౌన్సిలర్ సురేశ్ కుమార్ కుమార్తె సాహితీ సంధ్య (18) శ్రీకాకుళం జిల్లాలో అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుతోంది. సెలవులకి ఇంటికి వచ్చింది. కళాశాలకు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో సంధ్య చిన్నమ్మ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 8, 2025
చావును రాజకీయం చేయడానికే జగన్ పర్యటన: పరిటాల

ఒక చావును రాజకీయం చేయడానికే మాజీ సీఎం వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లికి వస్తున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. ఆ గ్రామంలో ఏం జరిగిందో జగన్‌కు తెలియదని, ప్రకాశ్ రెడ్డి చెప్పిన మాటలు విని వస్తున్నారని అన్నారు. ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా బాధిత కుటుంబానికి సాయం చేయాలని హితవుపలికారు. ప్రకాశ్ రెడ్డి రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారని, టీడీపీ నేతలు సంయమనం కోల్పోవద్దని సూచించారు.