News March 23, 2024
నాగర్ కర్నూల్: కారు చక్రాల కిందపడి 9 నెలల చిన్నారి మృతి
కారు వెనక్కి తీస్తుండగా చక్రాల కింద పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీను వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్‌కు చెందిన శ్రీను, వసుంధర దంపతులు హైదరాబాదులోని అత్తాపూర్‌లో ఉంటున్నారు. వీరికి తొమ్మిది నెలల పాప ఉంది. అపార్ట్మెంట్‌లోని ఓ వ్యక్తి కారు రివర్స్ తీస్తుండగా, చక్రాల కిందపడి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News January 6, 2025
ఉమ్మడి MBNR జిల్లాలో నేటి..TOP NEWS!
✔పాలమూరు ప్రాజెక్ట్‌కు జైపాల్ రెడ్డి పేరు ఎలా పెడతారు: ఎంపీ డీకే అరుణ✔వడ్డేమాన్: సంపులో పడి యువరైతు మృతి✔NGKL మాజీ ఎంపీకి జూపల్లి పరామర్శ✔ఉమ్మడి జిల్లాను వణికిస్తున్న చలి✔MBNR: పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్✔MBNR:7 నుంచి సదరం క్యాంపులు ✔రేపటి నుంచి సీసీ టీవీ కెమెరా సర్వీసింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ప్రారంభం✔పలుచోట్ల పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీలు
News January 6, 2025
మహబూబ్‌నగర్ జిల్లాలో నేటి వార్తలు ఇవే.. డోంట్ మిస్
❤️హెల్మెట్ లేకుంటే కలెక్టరేట్‌లోకి నో ఎంట్రీ: వనపర్తి కలెక్టర్ బాదావత్ సంతోష్.❤️జీవితంలో సైన్స్ చాలా అవసరం:నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్.❤️కాలేజీ బాత్రూమ్లో కెమెరా కలకలం: పోలీసుల అదుపులో ఓ యువకుడు.❤️బొట్టు పెట్టి చెప్తున్నాం.. పేరెంట్స్ మీటింగ్‌కు రండి సింగోటంలో గ్రామస్తులను ఆహ్వానించిన టీచర్లు.❤️ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం: ఎస్పీ గిరిధర్
News January 6, 2025
నాగర్‌కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండల పరిధిలోని జడ్చర్ల, కోదాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ట్యాంకర్‌ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు గణేశ్(30), రామకోటి(25)లుగా స్థానికులు గుర్తించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.