News April 10, 2025
నాగర్ కర్నూల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు..

నాగర్ కర్నూల్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో గరిష్ఠంగా నమోదైనా ఉష్ణోగ్రతల వివరాలు ఇలా.. అత్యధికంగా కల్వకుర్తి 39.4 డిగ్రీలుగా నమోదైంది. నాగర్ కర్నూల్ 39.3, బిజినేపల్లి 39.2, అచ్చంపేట, పెద్దకొత్తపల్లి 39.1, తెలకపల్లి, వంగూర్, కొల్లాపూర్ 38.8, కోడేర్ 38.5, ఉప్పునంతల 38.1, వెల్దండ 37.9, తాడూర్ 37.8 డిగ్రీలుగా నమోదయ్యాయి.
Similar News
News April 2, 2026
జయంతి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ రాజర్షి షా

ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్ రామ్, 14న అంబేడ్కర్ జయంతి వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మహనీయుల జీవిత చరిత్రపై ఫొటో ఎగ్జిబిషన్, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలన్నారు. వేడుకల ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్ దీపాలు, పెయింటింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు.
News April 2, 2026
ప్రత్తిపాడు క్వారీలో పేలుళ్ల కలకలం.. పరుగులు తీసిన కూలీలు

ప్రత్తిపాడు మండలం చినశంకర్లపూడి వద్ద ఓ స్టోన్ క్రషర్ క్వారీలో బుధవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. బ్లాస్టింగ్ ధాటికి నల్లరాతి పర్వతం కుప్పకూలడంతో రాళ్లు మీద పడి జేసీబీ ఆపరేటర్ తీవ్రంగా గాయపడ్డారు. కూలీలు ప్రాణభయంతో పరుగులు తీశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో క్షతగాత్రుడిని గుట్టుచప్పుడు కాకుండా కాకినాడ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనతో మైనింగ్ ప్రాంతం దద్దరిల్లిపోయింది.
News April 2, 2026
జగిత్యాల: క్షేత్రస్థాయిలో కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

కొండగట్టులో జరుగుతున్న చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి ఆలయ పరిసరాలను, దీక్షపరులు మాల విరమణ ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ప్రత్యక్షంగా వీక్షిస్తూ పలు సూచనలు చేశారు.


