News April 23, 2025

నాగర్ కర్నూల్ జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు ఇలా..

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 25 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా..అత్యధికంగా అచ్చంపేట, వంగూర్, పెద్దకొత్తపల్లి 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే తెలకపల్లి 42.1, కొల్లాపూర్ 42.0, వెల్దండ 41.8, కారకొండ 41.5, ఉప్పునుంతల, పెంట్లవెల్లి 41.4, బిజినేపల్లి 41.3, కల్వకుర్తి 41.1, నాగర్ కర్నూల్ 40.9, కోడేరు 40.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News April 23, 2025

HYD: MLC ఎన్నిక.. 112లో 88 మంది ఓటు

image

22 ఏళ్ల తర్వాత జరిగిన హైదరాబాద్ MLC కోటా ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు 112 ఓటర్లు ఉండగా మొత్తం 88 మంది ఓటు వేశారు. 24 మంది BRS ఓటర్లు మినహాయిస్తే MIM, కాంగ్రెస్, BJP సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 37.51%, మ. 12 గంటల వరకు 77.68%, మధ్యాహ్నం 78.57% ఓటింగ్ నమోదు అయ్యింది.

News April 23, 2025

బాన్సువాడ: చదువు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తుంది: DEO

image

చదువు మాత్రమే విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తుందని DEO అశోక్ అన్నారు. బుధవారం బాన్సువాడ మండలం బోర్లం ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వేసవి సెలవులు ఉన్నందున పిల్లలకు ఇంటి వద్ద చదివించాలన్నారు. అనంతరం 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ప్రగతి పట్టాలను అందజేశారు. ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ, గోపి, అయ్యాల సంతోష్ ఉన్నారు.

News April 23, 2025

వీరయ్య చౌదరికి CM నివాళి

image

నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులోని వీరయ్య చౌదరి నివాసానికి CM చంద్రబాబు చేరుకున్నారు. వీరయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.

error: Content is protected !!