News November 15, 2025
నాగర్ కర్నూల్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో అత్యల్పంగా 12.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వెల్దండలో 12.2, ఊర్కొండలో 12.3, కొండనాగులలో 12.4, కల్వకుర్తిలో 12.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో చలి కారణంగా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Similar News
News November 15, 2025
సంగారెడ్డి: సర్వే చేయించుకున్నారు.. పైసలిస్తలేరు!

జిల్లాలో గత ఏడాది సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఎన్యుమరేటర్లకు పారితోషకాన్ని చెల్లించాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దత్తు డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సర్వే చేసి ఏడాది గడిచిన పారితోషకం చెల్లించకపోవడం విచారకరమని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారితోషకాన్ని వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
News November 15, 2025
రూ.1,201 కోట్ల పెట్టుబడి.. రేమండ్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన

AP: సీఐఐ వేదికగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. రూ.1,201 కోట్ల మూడు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు రేమండ్ సంస్థ ప్రకటించింది. ఈమేరకు వాటికి సీఎం చంద్రబాబు, సంస్థ ఎండీ గౌతమ్ మైనీ శంకుస్థాపన చేశారు. దేశ ఏరోస్పేస్, రక్షణ అవసరాలను తీర్చేలా రేమండ్ పరికరాలు తయారుచేయడం అభినందనీయమని CBN అన్నారు.
News November 15, 2025
యాపిల్‌కు త్వరలో కొత్త CEO.. టిమ్ కుక్ వారసుడు ఎవరు?

2011లో స్టీవ్ జాబ్స్ నుంచి టిమ్ కుక్ యాపిల్ CEOగా బాధ్యతలు అందుకున్నారు. కంపెనీని 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లిన కుక్.. 2026 ప్రారంభంలో తన వారసుడిని ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. 2001లో హార్డ్‌వేర్ ఆర్కిటెక్ట్‌గా ప్రొడక్ట్ డిజైన్ టీమ్‌లో చేరిన జాన్ టెర్నస్ తదుపరి సీఈవోగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని టాక్. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్టులో పేర్కొంది.


