News January 29, 2026

నాగర్ కర్నూల్ జిల్లాలో క్రమంగా తగ్గుతున్న చలి

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో రోజురోజుకు చలితీవ్రత క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటలో అత్యల్పంగా వంకేశ్వర్, కొండారెడ్డిపల్లిలో 15.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పదర, అమ్రాబాద్ 15.1°C, ఐనోల్ 15.3°C, కొండనాగుల 15.4°C, బొల్లంపల్లి 15.5°C, తెలకపల్లి, వటవర్లపల్లి, తోటపల్లి లో 15.6°C, యంగంపల్లి, లింగాల 15.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News February 5, 2026

HYD: వర్క్ STRESSతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ SUICIDE

image

మియాపూర్‌లోని BKఎన్‌క్లేవ్‌లో ఓ యువకుడు గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. AP అమలాపురానికి చెందిన సతీశ్(31) గచ్చిబౌలిలోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నాడు. పనిఒత్తిడి తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. సతీశ్‌కు ఏడాది క్రితం వివాహం కాగా భార్య సొంతూరుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

News February 5, 2026

MDK: టీచర్‌గా మెప్పించి సూసైడ్ చేసుకుంది!

image

పాఠశాలలో నిర్వహించిన సెల్ఫ్ గవర్నమెంట్ డేలో టీచరై ఉత్తమ ప్రతిభ కనభరిచింది. అందరితో కలిసి మెలిసి మాట్లాడింది. సాయంత్రం ఇంటికి వచ్చి పనులన్నీ చేసింది. ఏమైందో తెలిదు కానీ తూప్రాన్ మండలం కోనాయపల్లి(PB)కి చెందిన పదో తరగతి విద్యార్థిని సుస్మిత(15) <<19052796>>సూసైడ్<<>> చేసుకుంది. సుస్మిత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం తూప్రాన్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

News February 5, 2026

దివ్యాంగులకు ఫ్రీగా 5G ఫోన్లు, బ్యాటరీ సైకిళ్లు

image

TG: దివ్యాంగులకు మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, 5G స్మార్ట్ ఫోన్లు ఫ్రీగా ఇవ్వనున్నట్లు దివ్యాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ వీరయ్య వెల్లడించారు. ఇందుకోసం OBMMS <>పోర్టల్‌<<>>లో ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గతంలో అప్లై చేసి పరికరాలు పొందని వారూ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు 9959583502 నంబర్(10am-6pm)లో సంప్రదించాలన్నారు.