News December 16, 2025

నాగర్ కర్నూల్ జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

image

√ఎర్రవల్లిలో 15వ రోజుకు చేరిన రీలే నిరాహార దీక్షలు
√చారకొండ: ఎర్రవల్లి గ్రామంలో రేపటి పోలింగ్ బహిష్కరణ
√వంగూర్: జాతీయ రహదారిపై కారు బోల్తా.. తప్పిన ప్రమాదం
√కొల్లాపూర్ ఇన్చార్జ్ ఎంఈఓ గా అబ్దుల్ రహీం
√అచ్చంపేట నియోజకవర్గంలో రేపు సర్పంచ్ ఎన్నికలు
√కొల్లాపూర్: నూతన సర్పంచులకు మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి సన్మానం
√అచ్చంపేట: బొమ్మనపల్లి పోలింగ్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ.

Similar News

News December 19, 2025

కాకినాడ: వాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’లో FIR డౌన్‌లోడ్ సౌకర్యం- SP

image

పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే FIR ప్రతిని పొందవచ్చని కాకినాడ జిల్లా SP బిందుమాధవ్ తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ మేరకు సూచనలు జారీ చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’లో FIR డౌన్‌లోడ్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ సేవల ద్వారా ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు, పోలీస్ సేవల్లో మరింత పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.

News December 19, 2025

సైబర్ నేరాల అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ శబరీష్

image

సైబర్ నేరాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని పోలీసు శాఖ చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరిష్ ఆన్లైన్ మోసాలను సూచించే వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్లో అపరిచితులతో పరిచయాలను దూరంగా ఉండాలని, డిజిటల్ అరెస్ట్ పేరుతో వీడియో కాల్స్ చేసి పోలీసులంటే నమ్మొద్దని, సైబర్ మోసమని గుర్తించి వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

News December 19, 2025

BREAKING: రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు

image

రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2018లో సరూర్‌నగర్ పరిధిలో 17 ఏళ్ల బాలికకు బలవంతపు పెళ్లి కేసులో పెళ్లి పెద్దగా వ్యవహరించిన బాలిక తండ్రికి రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. బాలిక భర్త, తండ్రికి రూ. 75వేల జరిమానా న్యాయమూర్తి వేశారు. బాధితురాలికి రూ.15లక్షల పరిహారాన్ని న్యాయమూర్తి మంజూరు చేశారు.