News March 19, 2025
నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడి నేపథ్యం ఇదే..!

నాగర్‌కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా వేముల నరేందర్ రావును అధిష్ఠానం నియమించిన విషయం తెలిసిందే. ఉప్పునుంతల మండలం పెద్దాపూర్‌కు చెందిన నరేందర్ విద్యార్థి దశ నుంచి నాయకత్వ పటిమను ప్రదర్శిస్తూ ఏబీవీపీ విద్యార్థి సంఘంలో చురుకైన పాత్ర పోషించారు. అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తూనే పార్టీలో కార్యకర్తగా చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేశారు.
Similar News
News March 19, 2025
సునీత రెండుసార్లు స్పేస్ వాక్ చేశారు: నాసా

అంతరిక్షం నుంచి వచ్చిన నలుగురు వ్యోమగాములు ఆరోగ్యంగా ఉన్నారని నాసా వెల్లడించింది. అన్ డాకింగ్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ వరకు అన్నీ అనుకున్నట్లు జరిగాయని తెలిపింది. స్పేస్ ఎక్స్, నాసా సమష్టి కృషితో వారిని భూమిపైకి తీసుకొచ్చామని పేర్కొంది. ఈ యాత్రను విజయవంతం చేయడంలో స్పేస్ ఎక్స్ కీలకపాత్ర పోషించిందని ప్రశంసించింది. ఈ యాత్రలో సునీత రెండుసార్లు స్పేస్ వాక్ చేశారని వివరించింది.
News March 19, 2025
ఉపాధి కూలీలకు రూ.400 వేతనం ఇవ్వండి: సోనియా

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు రోజువారీ కనీస వేతనాన్ని రూ.400 ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి 150 పనిదినాలు కల్పించాలన్నారు. పార్లమెంటులో జీరో అవర్‌లో ఆమె మాట్లాడారు. 2005లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దీనిని నిర్వీర్యం చేయాలని చూడటం ఆందోళనకరమని చెప్పారు.
News March 19, 2025
కొత్తపల్లి: మనవడని దత్తత తీసుకుంటే.. నమ్మించి మట్టుబెట్టాడు!

కొత్తపల్లి మండల శివారులో ఈనెల 15న వెంకటమ్మ అనే వృద్ధురాలు హత్యకు గురైన విషయం తెలిసిందే. వెంకటమ్మను హత్య చేసిన మనవడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వెంకటమ్మకు కొడుకులు లేకపోవడంతో బిడ్డ కొడుకుని దత్తతకు తీసుకుని వివాహం జరిపించింది. వెంకటమ్మ వద్ద ఉన్న డబ్బు, బంగారం కోసం తరచూ ఇబ్బందులు పెట్టడంతో బంధువుల ఇంటి వద్ద ఉంటోంది. LIC డబ్బులు వచ్చాయని పిలిపించి హత్యచేసి పారిపోగా పోలీసులు అరెస్టు చేశారు