News November 19, 2025
నాగర్ కర్నూల్: నేడు కబడ్డీ ఎంపికలు

NGKL(D) కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి MJP(CBM) కళాశాలలో నేడు కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు ఎం.జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ తెలిపారు. జూనియర్ బాలికలు(31-12-2005) తర్వాత జన్మించి, బరువు 65kgs లోపు, సీనియర్ మహిళలు 75kgs లోపు ఉండాలన్నారు. ఒరిజినల్ బోనోఫైడ్, టెన్త్ మెమో,ఆధార్‌తో హాజరు కావాలన్నారు. వివరాలకు 77803 42434 సంప్రదించాలన్నారు.
Similar News
News November 19, 2025
కాణిపాకం అభివృద్ధికి రూ.25 కోట్లు

కాణిపాకంలో భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు రూ.25 కోట్ల టీటీడీ నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. అక్టోబరు 28న జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో కాణిపాకం ఆలయ ప్రాంగణంలో భక్తులు బస చేయడానికి వీలుగా కాంప్లెక్సు, సామూహిక వివాహాల కోసం పెద్ద హాళ్లను నిర్మించేందుకు రూ.25కోట్లు ఆర్థిక సాయం అందించాలని తీర్మానం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
News November 19, 2025
HYD: రాహుల్ సిప్లిగంజ్ వివాహం.. సీఎంకి ఆహ్వానం

రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల ఆగస్టులో తను ప్రేమించిన అమ్మాయి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. వారి వివాహానికి నవంబర్ 27న పెద్దలు ముహూర్తం నిశ్చియించారు. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా హాజరు కానున్నట్టు సమాచారం. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్య హరిణ్యరెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. తన వివాహానికి ఆహ్వానించారు.
News November 19, 2025
ఒకేసారి 76 మంది CRPF జవాన్లను చంపిన హిడ్మా.. ఎలా అంటే?

హిడ్మా 2010లో చేసిన దాడిని భద్రతాబలగాలు ఎప్పటికీ మర్చిపోవు. 2010 ఏప్రిల్ 6న ఛత్తీస్‌గఢ్‌లో దంతెవాడ జిల్లా తాడిమెట్ల అటవీప్రాంతంలో CRPF జవాన్లపై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. కూంబింగ్ ముగించుకుని వస్తుండగా మందుపాతరలు పేల్చారు. వెంటనే 1,000 మందికి పైగా మావోయిస్టులు వారిని చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 76 మంది జవాన్లు మరణించారు. ఈ దాడికి నాయకత్వం వహించింది హిడ్మానే.


