News March 21, 2025
నాగర్ కర్నూల్: పెట్రోల్ పోయించుకుంటున్నారా.. జర జాగ్రత్త..!

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలోని ఓ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌కు బదులుగా నీరు రావడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. గుండాల గ్రామానికి చెందిన వ్యక్తి బుధవారం రాత్రి తన బైక్‌లో పెట్రోల్ నింపుకున్న తర్వాత బైక్ ఆగిపోయిందన్నారు. మెకానిక్‌ను సంప్రదించిన తర్వాత బైక్‌లో నుంచి పెట్రోల్‌ను తొలగించగా, అది నీరుగా మారినట్లు గుర్తించామన్నారు. బంకును తనిఖీ చేసి నమూనాను ల్యాబ్‌కు పంపారని తెలిపారు.
Similar News
News March 21, 2025
MBNR: ప్రభుత్వ ఆస్తులను టచ్ చేస్తే కఠిన చర్యలు: DE

చెరువులు, కుంటలు, ఇతర ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే చట్టపరమైన కఠినచర్యలు తప్పవని మైనర్ ఇరిగేషన్ DE మనోహర్ హెచ్చరించారు. ఏనుగొండలోని కొర్రంగడ్డ కుంటను కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారని ఫిర్యాదులు అందడంతో శుక్రవారం అధికారులతో కలిసి కుంటను ఆయన పరిశీలించారు. ప్రభుత్వానికి చెందిన ఆస్తులను ఆక్రమణలకు గురిచేస్తే ఎంతటి వారైనా సహించబోమని మనోహర్ తెలిపారు.
News March 21, 2025
చంద్రబాబు శకుని పాత్ర వేస్తే బాగుండేది: అంబటి

AP: ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాల్లో పస లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్లే YCP MLAలు సభకు వెళ్లలేదని చెప్పారు. కూటమి నేతలను పొగుడుకునేందుకే సభా సమయం సరిపోయిందన్నారు. స్కిట్స్‌లోనూ జగన్ పేరు మర్చిపోలేకపోయారని, CBN శకుని పాత్ర వేస్తే బాగుండేదని సెటైర్లు విసిరారు. YSR స్నేహితుడినని చెప్పుకునే ఆయన ఇప్పుడు వైఎస్సార్ జిల్లా పేరు మార్చారని మండిపడ్డారు.
News March 21, 2025
ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలి: గద్వాల కలెక్టర్

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈనెల 20న జోగులాంబ గద్వాల జిల్లా పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకం కింద నియామక పత్రాలను అందుకున్న అభ్యర్థులు ఈరోజు జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ సంతోష్‌ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నియామకం పొందిన అభ్యర్థులు ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలన్నారు.