News February 5, 2025
నాగర్ కర్నూల్: ‘మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు’

మైనర్లకు ఎవరూ వాహనాలు ఇవ్వొద్దని, విద్యార్థులు స్కూళ్లలోకి వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్లొద్దని సీఐ నాగార్జున అన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా స్వామి వివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News February 27, 2026
భద్రాద్రిలో వైభవంగా నిత్య కళ్యాణం

భద్రాద్రి రామాలయంలో శుక్రవారం సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ ఉత్సవ మూర్తులను బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం అనంతరం కంకణధారణ గావించి కల్యాణాన్ని జరిపారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
News February 27, 2026
RARE: ఒకేసారి ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చిన చైనా మహిళ

చైనాలోని షిన్జియాంగ్‌కు చెందిన 24 ఏళ్ల దిలి అనే మహిళ ‘వుహాన్ యూనివర్సిటీ’ ఆసుపత్రిలో ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చి అరుదైన రికార్డు సృష్టించింది. 20 మంది వైద్య సిబ్బంది కృషితో నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి క్షేమంగా జన్మించారు. సహజసిద్ధంగా ఇలా ఐదుగురు పిల్లలు పుట్టే అవకాశం 6 కోట్లలో ఒకరికి మాత్రమే ఉంటుందని వైద్యులు తెలిపారు. తమ కెరీర్‌లో ఇదే అత్యంత అరుదైన ప్రసవమని చీఫ్ డాక్టర్ పేర్కొన్నారు.
News February 27, 2026
45 కేసులు ఛేదన.. 76 మంది అరెస్టు: సీపీ

గడిచిన జనవరి నెలలో 69 ఆస్తి నేరాలు జరిగాయని 45 కేసులు గుర్తించి 76 మందిని అరెస్టు చేశామని నగర పోలీస్ కమిషనర్ శంఖబత్రబాగ్చి తెలిపారు. శుక్రవారం సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సమస్యల ప్రాపర్టీ మేళ నిర్వహించగా రూ.39.79 లక్షలు, 420 పోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ 63 లక్షలు ఉంటుందని వివరించారు. ఇప్పటివరకు నగరంలో రూ. 13.94 కోట్లు విలువైన మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు.


