News March 24, 2024

నాగర్ కర్నూల్: సీసీటీవీ ఫుటేజీతో.. హత్య కేసును ఛేదించిన పోలీసులు

image

ఓ మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. SP వివరాల ప్రకారం.. తెల్కపల్లి మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన లలిత(40) భర్త చనిపోయి ఒంటరిగా ఉంటుంది. లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన శివుడుతో పరిచయం ఏర్పడింది. ఈనెల 13న బల్మూరు మండలం మైలారం గ్రామ శివారులో ఇద్దరు కలిసి మద్యం తాగారు. శివుడు తాగిన మైకంలో ఆమెను హత్య చేసి నగలు దోచుకెళ్లాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు నిందితుడిని గుర్తించారు.

Similar News

News October 23, 2025

MBNR: నేర సమీక్ష.. కేసుల దర్యాప్తుపై ఎస్పీ దృష్టి

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డి.జానకి ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో క్రైమ్ కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల స్థితిపై ఆరా తీశారు. మహిళలు, బాలలపై నేరాలు, సైబర్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News October 23, 2025

MBNR: పోలీస్ ప్రధాన కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించిన ఎస్పీ

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి నెల వారి నేర సమీక్షను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. క్రైమ్‌కు సంబంధించిన అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అన్నారు. దర్యాప్తు నాణ్యతను మెరుగుపరిచి న్యాయస్థానాల్లో దోషులకు శిక్షపడేలా బలమైన సాక్ష్యాలు సేకరించాలన్నారు.

News October 23, 2025

మహమ్మదాబాద్‌లో అత్యధిక వర్షపాతం

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో మహమ్మదాబాద్ మండలంలో 13.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. హన్వాడ 13.7, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 4.8, గండీడ్ మండలం సర్కార్ పేట, దేవరకద్ర 3.8 , మహబూబ్‌నగర్ గ్రామీణం, భూత్పూర్ 3.3, జడ్చర్ల 3.0, నవాబుపేట మండలం కొల్లూరు 2.5, బాలానగర్ 2.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది.