News August 18, 2025
నాగల్‌గిద్ద: పెన్షన్ కోసం ఎదురు చూపు

నాగల్‌గిద్ద మండలంలోని శేరిధామస్‌గిద్దకు చెందిన తుర్రురాజు మూడేళ్ల నుంచి నడవలేని స్థితిలో ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం కాలుకి గాయం కావడంతో వైద్యులు అతని రెండు కళ్లు తొడ వరకు తొలగించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పెన్షన్ కోసం ఎన్ని సార్లు సదరం క్యాంప్‌నకు వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వేడుకుంటున్నాడు. అధికారులు స్పందించి పెన్షన్ మంజురు చేయాలని బాధితుడు కోరుతున్నాడు.
Similar News
News August 18, 2025
కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి.. ఐదుగురు దుర్మరణం

TG: హైదరాబాద్‌లో జరిగిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రామాంతపూర్‌లోని గోకుల్ నగర్‌లో శ్రీ కృష్ణ శోభా యాత్ర నిర్వహిస్తుండగా రథానికి కరెంట్ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. మృతులను శ్రీ కృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, రుద్రవికాస్, రాజేంద్రరెడ్డిలుగా గుర్తించారు.
News August 18, 2025
సంగారెడ్డి: జాతీయస్థాయి పోటీలకు నలుగురు ఎంపిక

హైదరాబాద్‌ని సరూర్ నగర్ మైదానంలో జరిగిన అత్యపత్య రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి జిల్లా నుంచి నలుగురు క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు అత్యపత్య అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విజయ్ నాయక్ ఆదివారం తెలిపారు. సెప్టెంబర్‌లో మహారాష్ట్రలో జరిగే జాతీయస్థాయి పోటీలో క్రీడాకారులు పాల్గొననున్నట్లు చెప్పారు.
News August 18, 2025
EP-40: వీరితో శత్రుత్వం వద్దు: చాణక్య నీతి

కొంతమందితో ఎప్పటికీ శత్రుత్వం పెంచుకోకూడదని, అది ఖరీదైనదిగా మారుతుందని చాణక్య నీతి చెబుతోంది. ‘మీ పొరుగువారితో సంబంధాలు చెడితే శత్రువులుగా మారుతారు. అత్యంత సన్నిహితులతోనూ శత్రుత్వం వద్దు. మీ రహస్యాలు, బలహీనతలు బయటపడి ముప్పుగా మారవచ్చు. కుటుంబసభ్యులనూ శత్రువులుగా చేసుకోవద్దు. ప్రభావవంతమైన వ్యక్తులతోనూ శత్రుత్వం వద్దు. ఆఫీసులో సహోద్యోగులతో శత్రుత్వం పెంచుకోకూడదు’ అని చెబుతోంది. #<<-se>>#Chanakyaneeti<<>>