News April 24, 2025
నాగల్ గిద్ద: భూభారతి చట్టంతో రైతులకు మేలు: కలెక్టర్

భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. నాగల్ గిద్దలో భూభారతి చట్టంపై అవగాహన సమావేశం గురువారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ చట్టంతో భూమికి సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, అదనపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు.
Similar News
News April 24, 2025
సరస్వతి పుష్కరాల పనుల్లో ఎలాంటి జాప్యం జరగద్దు: BHPL కలెక్టర్

సరస్వతి పుష్కరాల పనుల్లో ఎలాంటి జాప్యం జరగొద్దని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక అధికారులను ఆదేశించారు. గురువారం సరస్వతి పుష్కర పనుల ప్రత్యేక పర్యవేక్షణ అధికారులు, తహశీల్దార్, ఎంపీడీవోలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సరస్వతి పుష్కర పనులకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలని, పర్యవేక్షణ చేయలేక పోతే జిల్లా విడిచి వెళ్లాలని, జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
News April 24, 2025
ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తప్పని నీటి కష్టాలు

ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి నీటి కష్టాలు పొంచి ఉన్నాయి. ఓ పక్క భూగర్భ జలాలు అడుగంటడం, మరో పక్క మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రోజు విడిచి రోజు నీటి సరఫరాతో కష్టాలు తప్పేలా లేవు. అంతేకాక బోర్ల ద్వారా కూడా సరఫరా తగ్గిపోతుండటంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ఈ ఏడాది నీళ్ల ముప్పు ఎదురుకానుంది. ఖమ్మం నగరంలో మంచినీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
News April 24, 2025
సంగారెడ్డి: రేపటి నుంచి విద్యార్థులకు ఫ్రీ ట్రైనింగ్

సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రేపటి నుంచి జూన్ 5వ తేదీ వరకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు DEO వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో కుట్లు అల్లికలు, సంగీతం, చిత్ర లేఖనం, వ్యక్తిత్వ వికాసం, చదరంగం, టీఎల్ఎంలపై శిక్షణ ఇస్తామని, ఆసక్తి గల విద్యార్థులు పాఠశాలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.