News July 29, 2024
నాగార్జునసాగర్‌కు పెరుగుతున్న వరద ప్రవాహం

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 53,774 క్యూసెక్కులు వస్తోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 510.2 అడుగులుగా ఉంది. 312.05 టీఎంసీలకు గాను 131.01 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నిండుకుండను తలపిస్తోండగా రేపు గేట్లు అవకాశముంది. అదే జరిగితే సాగర్ త్వరలోనే నిండనుంది.
Similar News
News August 7, 2025
NLG: వారు అడగలేరు.. ప్రభుత్వమే ఇస్తే బాగు..!

పై చిత్రంలో కనిపిస్తున్న జిల్లోజు పూలమ్మ, జిల్లోజు రాములు అక్కాతమ్ముళ్లు. పుట్టుకతోనే మూగవారు. వీరి స్వగ్రామం SLG(M) ఇటుకులపహాడ్. బాల్యంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. వృద్ధాప్యంతో ఇబ్బందిపడుతున్నా నేటికీ పింఛను రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, కలెక్టర్ స్పందించి వారికి పింఛను మంజూరు చేయాలని కోరుతున్నారు.
News August 7, 2025
మిర్యాలగూడలో సాండ్ బజార్ ప్రారంభం

ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు మిర్యాలగూడలో సాండ్ బజార్‌ను ఏర్పాటు చేశారు. చింతపల్లి ఎక్స్ రోడ్డు వద్ద కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే బీఎల్ఆర్ ప్రారంభించారు. అందుబాటు ధరలో నాణ్యమైన ఇసుకను అందించడమే లక్ష్యమని వారు పేర్కొన్నారు.
News August 7, 2025
NLG: చేప పిల్లల పంపిణీ లేనట్టే.? పెరగనున్న ధరలు!

NLG జిల్లాలో మత్స్యకారులకు పంపిణీ చేయాల్సిన ఉచిత చేప పిల్లల సరఫరా కోసం ప్రభుత్వం ఇప్పటికి టెండర్లు పిలవలేదు. 3 నెలలు కావొస్తున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో ఈసారి చేప పిల్లల పంపిణీ లేనట్టేనని మత్స్యకారులు అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా డిపార్ట్మెంట్ చెరువులు, రిజర్వాయర్లు, గ్రామపంచాయతీ చెరువులు, కుంటలు కలిపి మొత్తం 1160కి పైగానే ఉన్నాయి. 60వేల మంది చేపల పెంపకం పై ఆధారపడి జీవిస్తున్నారు.