News March 20, 2025
నాగార్జునసాగర్‌కు భారీగా కేటాయింపులు

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో వివిధ పనుల కోసం గతేడాది కంటే ఈసారి బడ్జెట్‌ను భారీగా పెంచింది. గతేడాది బడ్జెట్లో రూ.96.07 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం ఈసారి వాటిని రూ.297.95 కోట్లకు పెంచింది. ఆ నిధులతో డ్యాం సంబంధిత, ప్రధాన పనులు, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పనులను చేపడతామని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో సాగర్ ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 20, 2025
NLG: నాలుగేళ్లుగా టీఏ, డీఏలకు అతీగతీ లేదు!

జిల్లాలో పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్లకు నాలుగేళ్ల నుంచి టీఏ, డీఏలకు అతీగతీ లేకుండాపోయింది. గతంలో ప్రతి నెలా రెండు మీటింగ్‌లకు రూ.500 చెల్లించేవారు. ఆ తర్వాత ప్రతి నెల ఒక సమావేశానికే టీఏ, డీఏ చెల్లిస్తామని అధికారులు ప్రకటించారు. ఒక్కో అంగన్‌వాడీ టీచరుకు కనీసం రూ.20 వేల వరకు టీఏ, డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక కూరగాయలు, వంట సామగ్రి, గ్యాస్ సిలిండర్లకు చెల్లింపులను అసలే పట్టించుకోవడంలేదు.
News March 20, 2025
NLG: 105 సెంటర్లలో రేపటి నుంచి పది పరీక్షలు

రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 105 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 18,925 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు అధికారులు చెప్పారు. వీరిలో 18,666 మంది రెగ్యులర్, 259 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 986 మంది ఇన్విజిలేటర్లు, 6 లైన్స్ కార్డ్ బృందాలను ఏర్పాటు చేశారు
News March 20, 2025
NLG: దరఖాస్తులకు చివరి తేదీ మరో 11 రోజులే!

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలలో విద్యనభ్యసిస్తున్న షెడ్యూల్డు కులాలకు చెందిన విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి ఉపకారవేతనాల మంజూరి కొరకు ఈనెల 31 లోగా ధరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్డు కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు వి. కోటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేయని విద్యార్థులు వెబ్సైట్ https://telanganaepass.cgg.gov.inలో నమోదు చేసుకోవాలని తెలిపారు.