News December 21, 2025
నాగార్జునసాగర్ నీటిమట్టం ఎంతంటే?

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి 19,472 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోందని డ్యామ్ అధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 569.50 అడుగులకు (255.31 టీఎంసీలు) చేరింది. సాగునీటి అవసరాల నిమిత్తం కుడి కాలువకు 9,500 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 7,272 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి స్థిరంగా వస్తున్న నీటితో సాగర్ జలకళను సంతరించుకుంది.
Similar News
News December 22, 2025
ఆల్ ఇండియా కామర్స్ సదస్సులో TG అధ్యాపకుడికి గోల్డ్ మెడల్

బెంగుళూరులో జరిగిన 76వ ఆల్ ఇండియా కామర్స్ సదస్సులో తెలంగాణకు చెందిన డాక్టర్ రామకృష్ణకు గోల్డ్ మెడల్ లభించింది. ఓయూ పూర్వ విద్యార్థి అయిన రామకృష్ణ ప్రస్తుతం కేరళ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇండోజీనియస్ ట్రైబల్ కమ్యూనిటీని డిజిటల్ ఎకానమీలో సమీకరించడంపై సమర్పించిన పరిశోధనా పత్రం ఉత్తమంగా ఎంపికైంది.
News December 22, 2025
NZB: జిల్లాలో లోక్ అదాలత్ లో 63, 790 కేసుల పరిష్కారం

ఆర్మూర్, బోధన్ కోర్టులతో పాటు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టులలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో సివిల్, రాజీకి వీలున్న క్రిమినల్ కేసులు మొత్తం 63,790 రాజీ పద్ధతిన పరిష్కారం అయినట్లు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయి సుధ తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు ఐదవ స్థానం లభించిందని ఆమె తెలిపారు.
News December 22, 2025
మోదీ, షాల వల్లే నక్సలిజం తగ్గింది: ఛత్తీస్‌గఢ్ సీఎం

AP: ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల నిర్ణయాల వల్లే తమ రాష్ట్రంలో నక్సలిజం చాలా వరకు తగ్గిందని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ తెలిపారు. రాజమండ్రిలో నిన్న మాజీ PM అటల్ బిహార్ వాజ్‌పేయీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కొన్ని దశాబ్దాలుగా నక్సలిజం కారణంగా తమ రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడక్కడా నక్సలిజం ఉందని, దాన్నీ పూర్తి స్థాయిలో రూపుమాపుతామని స్పష్టం చేశారు.


