News April 5, 2024
నాగార్జునసాగర్ నీటి మట్టం వివరాలు..

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. శుక్రవారం ఉదయం వరకు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 511.90 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 134.9183 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మెయిన్ పవర్ హౌస్‌కు నిల్, ఎస్సేల్బీసీ, ఎడమ కాల్వకు 7,675 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ఇన్ ఫ్లో లేదు.
Similar News
News January 26, 2026
మదర్ డెయిరీలో ముదిరిన సంక్షోభం

నల్గొండ జిల్లాలోని మదర్ డెయిరీలో పాలకవర్గ వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు పరాకాష్టకు చేరుకున్నాయి. 15 రోజుల్లోనే ఇద్దరు ఛైర్మన్లు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. తాజా పరిణామాలతో మందడి ప్రభాకర్ రెడ్డి తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. డెయిరీకి ఉన్న ₹28 కోట్ల అప్పు విషయంలో బ్యాంకులు సీరియస్ అయ్యాయి. ఫిబ్రవరి 1 లోగా ₹10 కోట్లు చెల్లించకుంటే డెయిరీని సీజ్ చేస్తామని హెచ్చరించాయి.
News January 26, 2026
నకిరేకల్: ఎదురెదురుగా ఢీకొన్న బైక్‌లు.. కానిస్టేబుల్ పరిస్థితి విషమం

నకిరేకల్ బైపాస్‌లోని సాయిప్రియ హోటల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెరువుగట్టు బ్రహ్మోత్సవాల బందోబస్తు ముగించుకొని బైక్‌పై వస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను, రాంగ్ రూట్లో బైక్‌పై వస్తున్న ఇద్దరు బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా ఓ కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని పోలీసులు తెలిపారు.
News January 26, 2026
నల్గొండ: నోటిఫికేషన్ ముంగిట అభ్యర్థుల వేట

రెండు మూడు రోజుల్లో మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలుండటంతో జిల్లాలో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. నల్గొండలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ నాలుగు డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించింది. రిజర్వేషన్ల మార్పులు, ఒక్కో వార్డులో పలువురు ఆశావహులు ఉండటంతో ఎంపిక కష్టంగా మారింది. గెలుపు గుర్రాల కోసం ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేశారు.


