News March 29, 2026
నాగావళి తీరంలో చెట్టుకు వేలాడుతున్న అస్థిపంజరం

ఆమదాలవలస (M) తోటాడ గ్రామం పరిధి నాగావళి నది తీరంలో మృతకళేబరం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఆదివారం సాయంత్రం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొన్నారు. ఆ ప్రాంతంలో ఓ చెట్టుకు తెల్లటి ప్లాస్టిక్ తాడుతో వేలాడుతున్న అస్థిపంజరాన్ని ఎస్సై బాలరాజు పరిశీలించారు. డెడ్‌బాడీ కుళ్లి ఎముకుల గూడుగా మారడంతో సుమారు 45-60 రోజుల క్రితం మరణించినట్లు భావిస్తున్నారు. హత్యా? సూసైడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 20, 2026
శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.