News November 22, 2024
నాగావళి, వంశధార కోతల నియంత్రణపై డిప్యూటీ సీఎం స్పీచ్
నాగావళి, వంశధార నదీ ప్రాంతాల్లో తీర ప్రాంత కోతల్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం చెన్నైలోని జాతీయ తీర ప్రాంత పరిశోధన కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. జాతీయ బృందం ఆ ప్రాంతాన్ని పరిశీలించిందని, అధ్యయన రిపోర్ట్ రాగానే ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటుందన్నారు.
Similar News
News November 22, 2024
SKLM: డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 3వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ పద్మారావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 63 పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు.
News November 22, 2024
గార: పుట్టిన రోజు వేడుకలకు వచ్చి.. అనంత లోకాలకు
పుట్టిన రోజు చేసుకోవాల్సిన ఇంట్లో విషాద ఘటన చోటు చేసుకుంది. గురువారం వమరవిల్లి ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. మృతుడు గొర్లె కృష్ణారావు (25) తన బంధువు కుమార్తె బర్త్ డే కోసం షాపింగ్‌కి వెళ్లి వస్తుండగా స్కూటీ అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొట్టడంతో స్పాట్‌లోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News November 22, 2024
శ్రీకాకుళంలో నిరుద్యోగులకు జాబ్ మేళా
శ్రీకాకుళంలోని APSRTC కాంప్లెక్స్ దగ్గర ఉన్న నెహ్రూ యువ కేంద్రంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో నిరుద్యోగ యువతకు ముత్తూట్ మైక్రోఫీల్డ్ సంస్థ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలో ఎంపికైతే శ్రీకాకుళంలోనే ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు. పోస్టులను బట్టి ఇంటర్, బీకాం, ఎంబీఏ విద్యా అర్హత కలిగి ఉండాలి. వయసు 18-26 ఏళ్లు పూర్తయిన వారు ఉదయం 9 గంటలకు హాజరు కావాలి. > share it