News April 4, 2024
నాగిరెడ్డిపేటలో బీఆర్ఎస్ నాయకుల సంబరాలు

నాగిరెడ్డిపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం వైస్ ఎంపీపీ పై అవిశ్వాసం నెగ్గడంతో సంబరాలు జరుపుకున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఇన్‌ఛార్జ్ ఎంపీపీగా కొనసాగిన వైస్ఎంపీపీ దివిటి రాజ్ దాస్ పై బీఆర్ఎస్ ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఆర్డీవో ప్రభాకర్ సమక్షంలో అవిశ్వాసం నెగ్గడంతో బీఆర్ఎస్ నాయకులు ఆనందంతో మిఠాయిలు పంచుకొని టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
Similar News
News March 2, 2025
KMR: లారీ-కారు ఢీ.. ఒకరు మృతి

ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ వద్ద శనివారం రాత్రి లారీ-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయయ్యాయి. క్షతగాత్రులు నాగిరెడ్డిపేట్ మండలం రాఘవపల్లి తండాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
News March 2, 2025
NZB: మూడిళ్లలో చోరీ.. నిందితుడి అరెస్ట్

తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని నిజామాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేసినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శివరాత్రి రోజు గంగస్థాన్ ఫేజ్-2, ఆర్టీసీ కాలనీ, ఏకశిలా నగర్ ప్రాంతాల్లో జరిగిన ఇళ్లలో చోరీల విషయంలో దర్యాప్తు చేయగా సయ్యద్ హమీద్ చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడిపై 85కు పైగా కేసులు ఉన్నాయి.
News March 2, 2025
NZB: రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు జిల్లా బృందం ఖరారు

తెలంగాణ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు నిజామాబాద్ జిల్లా సైక్లిస్టు బృందం ఖరారైనట్లు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.విజయ్ కాంత్ రావు తెలిపారు. ఈ సందర్భంగా కంఠేశ్వర్ బైపాస్ రోడ్‌లో జిల్లా స్థాయిలో వివిధ వయోపరిమితిలో ఎంపికల ప్రక్రియ నిర్వహించారు. ఎంపికైన జిల్లా బృందం ఈ నెల 7 నుంచి 9 వరకు హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.