News January 22, 2025
నాగిరెడ్డిపేట: చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

నాగిరెడ్డిపేట మండలం ఎర్రగుంట తండాకు చెందిన మలావత్ రేణుక(38) బుధవారం జప్తి జానకంపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్ఐ పేర్కొన్నారు.
Similar News
News November 5, 2025
పెరటి కోళ్ల పెంపకానికి అనువైన రకాలివే..

పెరటి కోళ్ల పెంపకం నేడు ఉపాధి మార్గంగా మారుతోంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నాటుకోళ్ల కంటే పెరటి కోళ్ల పెంపకంతోనే అధిక ఆదాయం సాధ్యమంటున్నారు నిపుణులు. వనరాజ, గ్రామప్రియ, గ్రామలక్ష్మి, వనశ్రీ, రాజశ్రీ, గాగస్, కడక్‌నాథ్, ఆసిల్ పెంపకానికి అనువైన పెరటి కోళ్ల రకాలు. వీటిలో కొన్ని 6 నెలల్లోనే 2-3 కిలోల బరువు పెరిగి, ఏటా 150-180 గుడ్లు పెడతాయి.✍️ మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News November 5, 2025
కర్నూలు కలెక్టరే టీచర్!

కర్నూలు కలెక్టర్ ఏ.సిరి మంగళవారం కోడుమూరులోని మహిళా సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థినుల మధ్య ఉపాధ్యాయురాలిగా కూర్చుని, వారికి విద్యపై మార్గదర్శకత్వం అందించారు. చదువులో మెళకువలు, సమయపాలన ప్రాముఖ్యత గురించి వివరించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రోత్సహించారు. హాస్టల్‌లో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
News November 5, 2025
శ్రీకాకుళం: మీలో ప్రతిభకు ఈ పోటీలు

యువజన సర్వీసుల శాఖ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో (జానపద బృంద నృత్యం, గీతాలు), స్టోరీ రైటింగ్, కవిత్వం, చిత్రలేఖనం, డిక్లమేషన్ పోటీలను NOV 11న నిర్వహించనున్నారు. ఆ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పలనాయుడు ప్రకటనలో తెలిపారు. 15-29 ఏళ్లు ఉన్న యువతీ, యువకులు అర్హులని, శ్రీకాకుళం(M)మునసబపేటలోని గురజాడ ఆడిటోరియంలో పోటీలు జరుగుతాయన్నారు. వివరాలకు పని వేళల్లో ఈనం:97041 14705ను సంప్రదించాలన్నారు.


