News March 17, 2025
నాగోల్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లు ఇవే..!

నాగోల్ నుంచి ఎల్బీనగర్ మెట్రో నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రణాళికలో భాగంగా నిర్ధారించిన మెట్రో స్టేషన్ల వివరాలను అధికారులు వెల్లడించారు. అల్కాపురి జంక్షన్, కామినేని ఆస్పత్రి, నాగోల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ జంక్షన్ వద్ద మెట్రో స్టేషన్లు రానున్నాయి. ఎల్బీనగర్ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో కనెక్టివిటీ జరగనుందని HMRL తెలిపింది.
Similar News
News March 17, 2025
గుండెపోటుతో ఆదివాసీ నాయకుడు మృతి

ఆళ్లపల్లి మండలం, మర్కోడు పంచాయితీ జిన్నెలగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ నాయకుడు కొమరం నరసింహారావు సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. నరసింహారావు వ్యవసాయం చేస్తూ, ఆదివాసీల అభివృద్ధి కోసం క్రియాశీలపాత్ర పోషించాడు. ఆయన మృతి విషయం తెలుసుకున్న పలువురు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
News March 17, 2025
ఫాస్ట్‌గా ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్

ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్ వేగంగా కొనసాగుతోంది. ఈ నెల 10నుంచి అధికారులు పేపర్లు దిద్దుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన అన్ని పేపర్లను కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కాలేజీలోనే వాల్యుయేషన్ చేస్తున్నారు. కాగా ప్రతీ గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. ఏప్రిల్ 10వ తేదీ లోపు ప్రాసెస్ పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు.
News March 17, 2025
ఫాస్ట్‌గా ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్

ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్ వేగంగా కొనసాగుతోంది. ఈ నెల 10నుంచి అధికారులు పేపర్లు దిద్దుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన అన్ని పేపర్లను కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కాలేజీలోనే వాల్యుయేషన్ చేస్తున్నారు. కాగా ప్రతీ గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. ఏప్రిల్ 10వ తేదీ లోపు నాటికి ప్రాసెస్ పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు.