News March 28, 2025

నాచారం: కొత్త డిస్పెన్సరీలు ఏర్పడే అవకాశం..!

image

మేడ్చల్ జిల్లా పరిధిలోని నాచారం సహా అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ESI ఆసుపత్రికి సంబంధించిన డిస్పెన్సరీలు ఉన్నాయి. ప్రస్తుత అవసరాన్ని గుర్తించిన అధికారుల బృందం మరికొన్ని డిస్పెన్సరీలు అవసరమని ప్రతిపాదనలు ప్రాథమికంగా సిద్ధం చేసింది. వీటిని త్వరలోనే ప్రభుత్వానికి పంపించి, ఆర్థిక శాఖ నుంచి పూర్తి అనుమతి పొందిన అనంతరం ఏర్పడే అవకాశం ఉంది.

Similar News

News November 11, 2025

జూబ్లీబైపోల్: మోడల్ బూత్‌లు.. మొబైల్ డిపాజిట్ కౌంటర్లు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గంలో 5 మోడల్ పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్ అసిస్టెన్స్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఓటర్ల సౌకర్యార్థం, పోలింగ్ బూత్‌లోకి అనుమతి లేని మొబైల్ ఫోన్‌లను భద్రపరిచేందుకు ప్రత్యేక డిపాజిట్ కౌంటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఓటింగ్ సజావుగా జరిగేలా చూసేందుకు, పలు పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే మాక్ పోలింగ్ (అనుకరణ పోలింగ్) ప్రారంభమైంది.

News November 11, 2025

ఆత్మహత్య ఘటనలో ఇద్దరికి రిమాండ్: ఎస్ఐ

image

నందిగం మండలం తురకలకోట గ్రామానికి చెందిన ఎం.వెంకటరావు(34) అనే వ్యక్తి శనివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు నందిగం పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటరావును వేధించిన పెట్రోల్ బంక్ యజమాని బీ.రమేశ్‌తో పాటు అతనికి సహకరించిన ఒక హెడ్ కానిస్టేబుల్ ఇరువురుని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నందిగం ఎస్ఐ షేక్ మహమ్మద్ అలీ తెలిపారు.

News November 11, 2025

వికారాబాద్: కల్లు దుకాణాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా.?

image

వికారాబాద్ జిల్లాలో కల్లు దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా SP నారాయణ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో సమావేశం ఏర్పాటు చేసి SHOలు షాపు యజమానులకు సూచించారు. అయితే ఇప్పటి వరకు పలు దుకాణాల వద్ద కెమెరాలు ఏర్పాటు చేయలేకపోయారు. SP ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా చొరవ తీసుకొని ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.