News August 13, 2025
నాటిన మొక్కలను సంరక్షించాలి: కలెక్టర్

నాటిన మొక్కలను ప్రతి ఒక్కరూ సంరక్షించాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం సాత్నాల మండలకేంద్రంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ఆయన మొక్కలను నాటారు. అనంతరం సాత్నాల ప్రాజెక్టును పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గేట్ ఎత్తే వేసే ముందు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సమాచారం అందజేయాలని సూచించారు.
Similar News
News August 13, 2025
రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన ఆదిలాబాద్ ఎంపీ

ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ బుధవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. 5th షెడ్యూల్ ప్రాంత పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటించాలని ఎంపీ కోరారు. స్పందించిన గవర్నర్ వర్షాకాలం తర్వాత టూర్ పెడతానని తెలిపారన్నారు. అనంతరం గిరిజన ఉద్యోగ సంఘ బాధ్యులు గిరిజన ప్రాంత సమస్యల గురించి వినతిపత్రం అందజేశారు.
News August 13, 2025
నిండుకుండలా లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్

సాత్నాల ప్రాజెక్టు కుడి కాల్వ కింద జైనథ్ మండలంలో ఉన్న లక్ష్మీపూర్ బ్యాలెన్స్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద 7,600 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. మంగళవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండటం, సాత్నాల కుడి కాలువ నుంచి లక్ష్మీపూర్ ప్రాజెక్టులోకి నీటి విడుదల కొనసాగుతుండడంతో అలుగు పారే అవకాశం ఉంది.
News August 13, 2025
ADB: హర్ ఘర్ తిరంగా ప్రచారం

మిషన్ శక్తి – DHEW బృందం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని పలు విద్యాసంస్థల్లో బుధవారం హర్ ఘర్ తిరంగా ప్రచారం కార్యక్రమంతో పాటు అవగాహన సదస్సు నిర్వహించారు. పౌరులు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రోత్సహించే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని చేపట్టినట్లు జిల్లా మిషన్ కోఆర్డినేటర్ యశోద తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా దేశభక్తి భావాన్ని పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.