News June 25, 2024
నాటి నుంచి నేటి వరకు మిథున్‌రెడ్డి ప్రయాణం

వైసీపీలో కీలక నేతగా వ్యవహరించిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సోమవారం ముచ్చటగా మూడోసారి గెలిచి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి 2014 ఎన్నికల్లో 1,74,062 ఓట్ల మెజార్టీతో నాటి బీజేపీ అభ్యర్థి పురందీశ్వరిపై గెలిచారు. 2019లో 2,68,284 ఓట్ల మెజార్టీతో TDP అభ్యర్థి సత్యప్రభపై విజయం సాధించారు. ఇక 2024లో ఉమ్మడి AP మాజీ CM కిరణ్‌కుమార్ రెడ్డిపై 76,071 ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు.
Similar News
News September 13, 2025
మైదుకూరు: తల్లీబిడ్డ మిస్సింగ్

మైదుకూరుకు చెందిన ముత్తరాయపల్లెలో నివసించే మేకల సుమతి (22) తన రెండేళ్ల కుమారుడు చందుతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనిపై భర్త చెండ్రాయుడు, ఆమె తల్లి మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సుమతి ఆచూకీ తెలిసినవారు మైదుకూరు సీఐ (9121100618), ఎస్సై(9121100619)కు సమాచారం ఇవ్వాలని కోరారు.
News September 12, 2025
కడప: RI వీరేశంను సన్మానించిన ఎస్పీ

కడప జిల్లా పోలీసు శాఖకు RI వీరేశ్ ఎంతగానో సేవలు అందించాలని జిల్లా SP అశోక్ కుమార్ ప్రశంసించారు. శుక్రవారం బదిలీపై చిత్తూరుకు వెళ్తున్న ఆర్ఐ వీరేశ్‌కు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ అప్పగించిన విధులను సమర్ధవంతంగా నిర్వర్తించారన్నారు. వీఐపీల రాక సందర్భంలో ఆర్‌ఐ వీరేశ్ అంకితభావంతో విధులు నిర్వర్తించారన్నారు.
News September 12, 2025
భూ సమస్యలపై త్వరిత పరిష్కారం: ఆదితిసింగ్

కడప కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జేసీ ఆదితిసింగ్ అధికారులకు కీలక సూచనలు చేశారు. భూ సంబంధిత ఫిర్యాదులకు బాధ్యతాయుతంగా స్పందించి, వచ్చే నెలలోపు పెండింగ్ ఫిర్యాదులను “సున్నా” స్థాయికి తగ్గించాలని ఆదేశించారు. సెక్షన్ 22-ఏ డెలిషన్, అసైన్డ్ భూముల పరిష్కారంలో క్షేత్రస్థాయి విచారణ తప్పనిసరని పేర్కొన్నారు.