News April 4, 2025
నాటుసారా నిర్మూలనకు కృషి చేయాలి- జేసీ

బాపట్ల జిల్లాలో నాటుసారా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో నాటు సారా నిర్మూలన జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రఖర్ జైన్ మాట్లాడుతూ.. జిల్లాలో నాటుసారా తయారు చేసే గ్రామాలను గుర్తించాలన్నారు. నాటుసారా ఆరోగ్యానికి హానికరం అన్నారు.
Similar News
News April 11, 2025
నెగటివ్ ప్రచారంపై ఘాటుగా స్పందించిన హీరోయిన్

సోషల్ మీడియాలో నెగటివిటీని ప్రచారం చేసే వారికి ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుందని హీరోయిన్ త్రిష ఇన్‌స్టాలో ప్రశ్నించారు. ఖాళీగా కూర్చొని ఇతరులపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు చేయడమే పనా అని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వారితో కలిసి జీవించేవారి గురించి ఆలోచిస్తే బాధగా అనిపిస్తుందన్నారు. నిన్న విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకి తమిళంలో డబ్బింగ్ చెప్పకపోవడంతో SMలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.
News April 11, 2025
రేషన్ లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన పొంగులేటి

పినపాక నియోజకవర్గం మణుగూరు మండలం కూనవరం గ్రామంలో సన్నబియ్యం పథకం అమలులో భాగంగా లబ్ధిదారుడు వంకా శివలక్ష్మి ఇంట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ శుక్రవారం భోజనం చేశారు. పేదల సంక్షేమం కోసమే ఈ పథకం ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ పాల్గొన్నారు.
News April 11, 2025
పదోన్నతి బాధ్యత మరింత పెంచుతుంది: ASF SP

పదోన్నతి ఉత్సాహంతో పాటు మరింత బాధ్యత పెరుగుతుందని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్స్‌గా విధులు నిర్వర్తిస్తూ ఆరుగురు హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి పొంది ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి కలిశారు.