News March 18, 2025

నాటు సారాలేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

మన రాష్ట్రాన్ని నాటు సారాలేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పిలుపునిచ్చారు. మంగళవారం తిరువూరులో నాటు సారా నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సారా నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నాటు సారా తయారీదారులకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగ కల్పన కల్పిస్తామని అన్నారు. చదువులేని వారికి ఎంచుకున్న ఉపాధి తప్పనిసరిగా అందిస్తామని పేర్కొన్నారు.

Similar News

News March 19, 2025

జిల్లాలోనే ప్రథమ స్థానం కోట్‌పల్లి ప్రథమ స్థానం 

image

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 20మండలాల పరిధిలో 100% ఇంటి పన్ను వసూలు చేసి జిల్లాలోనే కోట్‌పల్లి మండలం ప్రథమ స్థానంలో నిలిచింది. మండల వ్యాప్తంగా మొత్తం 18 గ్రామ పంచాయతీలకు గాను 18 గ్రామ పంచాయతీలో 100% ఇంటి పన్ను వసూలు చేసి పంచాయతీ అధికారులు సక్సెస్ సాధించారు. 2వవ స్థానంలో వికారాబాద్ 96%, మూడవ స్థానంలో బంట్వారం, ధరూర్ 94%, తాండూరు మండలం 74% చివరి స్థానంలో ఉంది.

News March 19, 2025

జగిత్యాల: బడ్జెట్‌పైనే భారమంతా..!

image

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఉమ్మడి KNR జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్‌లో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, ఓదెల, కాళేశ్వరం, ఇల్లందకుంట ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని భక్తులు కోరుతున్నారు. జమ్మికుంట బస్సుడిపో ఏర్పాటు, కల్వల ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి KNR జిల్లాకు ఇంకేం కావాలో కామెంట్ చేయండి.

News March 19, 2025

రాష్ట్ర బడ్జెట్‌పై ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆశలు

image

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ADB జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఉట్నూర్ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా, జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్, స్పిన్నింగ్ వద్ద ఫ్లైఓవర్ పనులకు, చనాక-కొరాట ప్రాజెక్ట్, కుంటాల, పొచ్చర జలపాతాల వద్ద అభివృద్ధి, పర్యాటక రంగానికి, పురాతన ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు.

error: Content is protected !!