News March 1, 2026
నాడు కత్తుల పోరు.. నేడు క్షిపణుల హోరు

పూర్వం రాజ్యాల కోసం రాజులు దండెత్తి, అమాయకులను బలితీసుకున్నారనే గాథలు విన్నాం. నేడు ఆధునిక ప్రపంచంలోనూ అదే క్రూరత్వం కనిపిస్తోంది. ఒకరిని అంతం చేసేందుకు దేశాలు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ భీకర దాడుల్లో పసిపిల్లలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అభివృద్ధి చెందిన దేశాలు సైతం పాతకాలపు క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ అమాయకుల రక్తంతో యుద్ధ క్షేత్రాన్ని తడపడం మానవత్వానికే తీరని మచ్చ.
Similar News
News March 1, 2026
ఇంజిన్ ఆపినా కార్లు కొండపైకి కదులుతాయి!

లద్దాక్‌లోని మ్యాగ్నెటిక్ హిల్ ఒక వింతైన పర్యాటక ప్రాంతం. ఇక్కడ వాహనాల ఇంజిన్ ఆపివేసినా, అవి గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా కొండపైకి వాటంతట అవే కదులుతాయి. సుమారు 20kmph వేగంతో వాహనం పైకి వెళ్లడం పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయస్కాంత శక్తి వల్ల జరుగుతుందని కొందరు భావిస్తుండగా.. ఆప్టికల్ ఇల్యూషన్ అని మరికొందరు చెబుతున్నారు. ఇలాంటి వింత విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..
News March 1, 2026
మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత.. PM మోదీ కీలక భేటీ

ప్రధాని మోదీ కాసేపట్లో ఢిల్లీలో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(CCS)తో మీటింగ్ నిర్వహించనున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్-US యుద్ధంతో మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న పరిస్థితులు, గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రతపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల రాజస్థాన్, తమిళనాడు పర్యటన అనంతరం PM మోదీ కొద్దిసేపట్లో ఢిల్లీ చేరుకోనున్నారు. కాగా CCS దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుంది.
News March 1, 2026
ఈ నెల 4న ‘విరోష్’ రిసెప్షన్.. వారికే అనుమతి!

విజయ్ దేవరకొండ, రష్మిక రిసెప్షన్ ఈ నెల 4న HYDలో జరగనుంది. వాలిడ్ ఇన్విటేషన్ ఉన్నవారినే అనుమతించనున్నట్లు ‘విరోష్’ జోడి ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. ‘భద్రతా కారణాల దృష్ట్యా పోలీసుల సూచనతో గెస్ట్ లిస్ట్‌ను కుదించాం. దయచేసి ఇన్విటేషన్ లేని వారు ఈవెంట్ ప్లేస్‌కి రావొద్దు. ఎలాంటి అంతరాయం లేకుండా రిసెప్షన్ జరిగేందుకు సహకరించండి’ అని కోరింది. కాగా ఈరోజు CM రేవంత్‌ను రష్మిక రిసెప్షన్‌కు ఆహ్వానించారు.


