News May 4, 2024

నాడు ప్రామిసరీ నోట్లు.. నేడు గాడ్ ప్రామిస్‌లు: హరీశ్ రావు

image

మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీజేపీలను ఎంపీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. అక్బర్ పేట భూంపల్లిలో జరిగిన కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో నాడు ప్రామిసరీ నోట్లు రాసిచ్చి.. నేడు గాడ్ ప్రామిస్‌లు చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.

Similar News

News September 12, 2025

ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం ఆయన మెదక్ మున్సిపాలిటీలోని గోల్కొండ వీధి, గాంధీనగర్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలను రక్షించడానికి శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు.

News September 12, 2025

RMPT: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

15 రోజుల క్రితం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా షాక్ తగిలి గాయాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. తొనిగండ్ల గ్రామానికి చెందిన మంగలి అనిల్ అనే వ్యక్తి జాన్సీ లింగాపూర్ శివారులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద 15 రోజుల క్రితం షాక్ తగలడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 12, 2025

శిథిల భవనాలకు ప్రతిపాదనలు అందజేయాలి: కలెక్టర్

image

జిల్లాలో వర్షం కారణంగా ప్రభావితమైన శిథిలావస్థలో ఉన్న అన్ని సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు, కళాశాలల భవనాలకు సంబంధించి ప్రతిపాదన సిద్ధం చేసి అందజేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మెదక్ కలెక్టరేట్ నుంచి డీఈవో, ఇంజినీరింగ్ అధికారులతో గూగుల్ మీట్ ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో 108 ఉన్నాయని వీటికి గడువులోగా నివేదికలు తయారు చేయాలన్నారు.