News November 20, 2025
నాణెం ఎలా ఉంది?

పుట్టపర్తి సత్యసాయి బాబా సేవలను స్మరించుకుంటూ ప్రధాని మోదీ రూ.100 స్మారక నాణెం, పోస్టల్ స్టాంపులను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాణేన్ని ముద్రించింది. ఈ నాణేన్ని వెండి, రాగి, నికెల్, జింక్‌తో తయారు చేసినట్లు తెలుస్తోంది. నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు సత్యసాయి చిత్రం, ఆ చిత్రం కింద భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని హిందీ భాషలో ముద్రించారు.
Similar News
News March 17, 2026
ట్రంప్‌కు భారీ షాక్

హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు సహకరించాలని US అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన <<19394650>>పిలుపునకు<<>> మిత్ర దేశాలు, చైనా ససేమిరా అన్నాయి. ఈ యుద్ధంతో తమకు సంబంధం లేదని నాటో దేశాలైన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్‌తోపాటు జపాన్ తేల్చిచెప్పాయి. అక్కడికి యుద్ధ నౌకలను పంపబోమని స్పష్టం చేశాయి. ముందు దాడులను ఆపాలని చైనా సూచించింది. తమకు సహకరించకపోతే నాటోకు భవిష్యత్తు ఉండదని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
News March 17, 2026
శ్రీకాకుళం: ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు

మందస మండలంలోని పిడిమందస గ్రామానికి చెందిన సేనాపతి విక్రమ్ కుమార్ ఒకేసారి మూడు ఉద్యోగాలను సాధించాడు. సామాన్య పేద రైతు కుటుంబంలో జన్మించిన ఈయన చదువు ప్రభుత్వ పాఠశాలలో సాగింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసిస్టెంట్ క్లర్క్(కర్ణాటక), ఐబీపీఎస్ క్లర్క్, కెనరా బ్యాంక్, కర్ణాటక, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. స్థానికులు అభినందనలు తెలిపారు.
News March 17, 2026
ఏపీ పీజీ ఈసెట్ దరఖాస్తు గడవు 20 వరకు పొడిగింపు

ఇంజినీరింగ్, ఫార్మసీ పీజీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీ ఈసెట్ దరఖాస్తు గడువు మార్చి 20 వరకు పొడిగించినట్లు కన్వీనర్ ఏయా ఆచార్య పి.మల్లికార్జునరావు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారన్నారు. మార్చి 23 వరకు రూ.1000, మార్చి 26 వరకు రూ.2 వేలు, మార్చి 28 వరకు రూ.4 వేలు, ఏప్రిల్ 1 వరకు రూ.పదివేలు ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు.


