News January 12, 2026

నాణ్యతలో రాజీ పడొద్దు.. విద్యార్థుల కిట్‌పై రేవంత్

image

TG: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువుల కిట్‌కు సంబంధించి నాణ్యత విషయంలో రాజీపడొద్దని CM రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ‘వేసవి సెలవుల తర్వాత బడులు ప్రారంభమయ్యే నాటికి కిట్ అందించేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల విషయంలో ఖర్చుకు వెనకాడొద్దు. యూనిఫామ్, బెల్ట్, టై, షూస్, బ్యాగ్, నోట్ బుక్స్, ఇతర వస్తువులను అందించేందుకు ప్రొక్యూర్మెంట్ ప్లాన్లు సిద్ధం చేయాలి’ అని ఆదేశించారు.

Similar News

News February 12, 2026

ఓటు లైట్ తీసుకున్నారా?

image

TG: మున్సిపాలిటీ ఓటర్లు పోలింగ్ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సగటున 82% పోలింగ్ నమోదవ్వగా మున్సిపాలిటీల్లో 73శాతమే నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో గ్రామీణ ఓటర్లే బాధ్యతగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పలు చోట్ల వృద్ధులు, విదేశాల నుంచి వచ్చి మరి ఓటేసిన ఘటనలు ఉన్నా మరికొందరు రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించుకోవడంలో చైతన్యంగా కనిపించలేదు.

News February 12, 2026

నేటి సామెత: కొబ్బరి చెట్లకు కుడితిమిత్తి

image

కొబ్బరి మొక్కకు వృథాగా పారబోసే కుడితిని నీరుగా పోసి పెంచితే, అది పెద్దయ్యాక మనకు ఎన్నో కాయలను అందించి ఆ రుణాన్ని తీర్చుకుంటుంది. చిన్నతనంలో మనం చేసిన చిన్న సహాయానికి లేదా పెట్టిన పెట్టుబడికి ఆ చెట్టు భవిష్యత్తులో అంతకంటే ఎక్కువ ప్రతిఫలాన్ని మనకు తిరిగి అందిస్తుంది. అలాగే చిన్నప్పుడు పిల్లలకు మంచి సంస్కారం, విద్యను అందిస్తే వారు పెద్దయ్యాక తల్లిదండ్రులను గౌరవంగా చూసుకుంటారని ఈ సామెత చెబుతుంది.

News February 12, 2026

శివ నామాలు అర్థాలు ‘‘శంకర’’

image

‘శం’ అంటే అనంతమైన సుఖం/శాంతి అని అర్థం. ‘కర’ అంటే కలిగించేవాడు. ఎవరైతే తనను నమ్ముకున్న భక్తులకు, ఈ చరాచర జగత్తుకు శాంతిని, ఆనందాన్ని ప్రసాదిస్తారో ఆయనే శంకరుడు. మానవ జీవితంలో ఎదురయ్యే అశాంతిని దూరం చేసి, మనసును నిర్మలం చేసే దైవం ఆయన. లోక కల్యాణం కోసం నిరంతరం తపించేవాడు కాబట్టే ఆయనను దర్శించుకున్నా, స్మరించుకున్నా మనకు తెలియని ఓ ప్రశాంతత లభిస్తుంది. సర్వ ప్రాణులకు శుభాన్ని కలిగించే మంగళకారి ఆయన.