News July 12, 2024
నాణ్యమైన విద్య..మన అందరి నినాదం కావాలి: అనంత కలెక్టర్

నాణ్యమైన విద్య..మన అందరి నినాదం కావాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎంఈఓలకు సూచించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో గురువారం విద్యాశాఖ పరిధిలోని ‘నేను బడికి పోతా’, అకడమిక్ మానిటరింగ్ వింగ్, సివిల్, ఇంజనీరింగ్ పనులు, మధ్యాహ్న భోజనం, నాడు- నేడు, అదనపు తరగతి గదులు, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు.
Similar News
News December 22, 2025
అర్జీల పరిష్కారంలో దృష్టి పెట్టాలి: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిచారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల సమస్యలపై ప్రజల నుంచి 385 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను గడువులోపు పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ప్రజలు ప్రజా వేదికలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 22, 2025
సిద్దరాంపురం వాసికి IESలో ఆల్ ఇండియా 22వ ర్యాంక్

ఆత్మకూరు మండలం సిద్దరాంపురం గ్రామానికి చెందిన తాల్లూరు హరికృష్ణ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో ఆల్ ఇండియా లెవెల్ 22వ ర్యాంక్ సాధించారు. ఆత్మకూరు మాజీ జడ్పీటీసీ హనుమంతప్ప చౌదరి మనవడైన హరికృష్ణ అత్యుత్తమ ర్యాంక్ సాధించడంపై ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ హర్షం వ్యక్తం చేశారు. 2022 నుంచి RWS శాఖలో AEEగా కుప్పంలో విధులు నిర్వహిస్తూ, IES కోసం కష్టపడి తాజాగా 22వ ర్యాంక్ సాధించారు.