News September 28, 2025

నాతయ్యపాలెం జాతీయ రహదారిపై యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

నాతయ్యపాలెం జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం నాతయ్యపాలేనికి చెందిన బలగా రమణ రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. గాయపడిన రమణ తీవ్ర రక్తస్రావంతో అక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Similar News

News September 29, 2025

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో PGRS

image

విశాఖ కలెక్టరేట్‌లో 29వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదే విధంగా సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

News September 28, 2025

మాధవధార: ఇసుక లోడింగ్ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

image

మాధవధార సీతన్న గార్డెన్స్‌లో లారీలోకి ఇసుక లోడ్ చేస్తూ యర్ర రాజు(35) అనే వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఎయిర్‌పోర్ట్ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మిత్తం KGHకి తరలించారు. యర్ర రాజు ఆనందపురం గొల్ల కరణంలో నివాసం ఉంటూ పనుల నిమ్మితం మాధవధార వచ్చాడు. మృతినికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News September 28, 2025

గాజువాక: రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య

image

గాజువాక సమీపంలోని హరిజన జగ్గయ్యపాలెం రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆదివారం ఈ సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుని వయస్సు 60 ఏళ్లు ఉంటాయని, ట్రాక్‌పై తల, మెండెం వేరయ్యయని తెలిపారు. ఇది ఆత్మహత్యగా పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది.