News March 14, 2025

నాతవరంలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

image

నాతవరం మండలం చిక్కుడుపాలెం దగ్గర ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామానికి చెందిన పెదపాత్రుని సత్తిబాబు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ భీమరాజు ఘటనా స్థలికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News November 4, 2025

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(<>HAL<<>>) 9 డిప్లొమా టెక్నీషియన్, టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, NTC+NAC(ITI) అర్హతగల అభ్యర్థులు నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in

News November 4, 2025

అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండాలి: కలెక్టర్

image

వర్షాల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పనులు పర్యవేక్షించాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. కొనుగోలు పూర్తయిన ధాన్యాన్ని వెంటనే ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని చెప్పారు. మిల్లులకు చేరిన లోడును తడవక ముందే వెంటనే దింపుకోవాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, మార్కెటింగ్ అధికారులతో ఆయన మాట్లాడారు.

News November 4, 2025

సంగారెడ్డి జిల్లా వైద్యాధికారిగా వసంతరావు

image

సంగారెడ్డి జిల్లా వైద్యాధికారిగా డాక్టర్ వసంతరావును నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ క్రిస్టియాన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆర్ఎంవోగా పనిచేస్తున్న వసంతరావు పదోన్నతిపై సంగారెడ్డి జిల్లాకు రానున్నారు. ఇక్కడ ఇన్‌ఛార్జ్ జిల్లా వైద్యాధికారిగా ఉన్న డాక్టర్ నాగ నిర్మల డిప్యూటీ వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరిస్తారు.