News March 19, 2025
నాదెండ్లతో నెల్లూరు నేతల భేటీ

మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన నెల్లూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోని మంత్రి ఛాంబర్‌లో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. మంత్రులు ఆనం, నారాయణ, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి, సోమిరెడ్డి తదితరులు ఉన్నారు.
Similar News
News March 19, 2025
తెడ్డుపాడు హైవేపై ప్రమాదం.. ఒకరు మృతి

దుత్తలూరు మండలం తెడ్డుపాడు – నర్రవాడ జాతీయ రహదారి ప్రాంతంలో రాత్రి 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తెడ్డుపాడు ఎస్సీ కాలనీకి చెందిన మేలింగి సురేశ్ ( 32 )అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బైక్‌పై వస్తున్న సురేశ్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. నర్రవాడ నుంచి తెడ్డుపాడు ఎస్సీ కాలనీకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
News March 19, 2025
కోడూరు బీచ్‌లో షూటింగ్ సందడి..!

తోటపల్లి గూడూరు మండలం కోడూరు బీచ్ తీరంలోని వేళాంగిణి మాత ఆలయం పరిసర ప్రాంతాలలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. చిత్ర యూనిట్ భక్తి సంబంధమైన “అసుర సంహారం” సినిమా చిత్రీకరణ చేపట్టారు. ఈ చిత్రంలో ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. చిత్రం నిర్వాహకులు మాట్లాడుతూ”అసుర సంహారం” ప్రధాన ఘట్టాలు నెల్లూరు జిల్లాలో చిత్రీకరిస్తున్నారన్నారు.
News March 19, 2025
నెల్లూరు: ప్రియురాలి గురించి మాట్లాడాలని పిలిచి హత్య

నెల్లూరు పొదలకూరు రోడ్డులో చింటూ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని వేదాయపాళెం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కృష్ణ సాయి అనే నిందితుడికి మృతుడికి మధ్య వివాదం ఉంది. ఈ నేపథ్యంలో 14న చింటూకి ఫోన్ చేసి తన ప్రియురాలి గురించి మాట్లాడాలని పిలిపించి కత్తులతో పొడిచి హత్య చేశారు.