News June 14, 2024

నాదెండ్ల మనోహర్‌కు ఏ శాఖ?

image

తెనాలి నుంచి గెలిచిన నాదెండ్ల మనోహర్‌ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా, ఆయనకు ఇంకా శాఖ కేటాయించపోవడంతో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు, ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మరో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనగాని సత్యప్రసాద్‌కు ఏ శాఖ కేటాయిస్తారనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.

Similar News

News September 14, 2025

గుంటూరు: నష్టపరిహారంగా రూ.1.11 కోట్లు

image

గుంటూరు జిల్లాలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 11,388 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి. ఇందులో సివిల్ కేసులు 908, క్రిమినల్ కేసులు 10,480 ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీనివాసుల కుటుంబానికి రూ.1.11 కోట్లు పరిహారం అందజేయడం ప్రధానంగా నిలిచింది. ప్రజలు సమయం, డబ్బు ఆదా చేసుకునేలా ఈ వేదికను మరింతగా వినియోగించుకోవాలని జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి తెలిపారు.

News September 13, 2025

గుంటూరు: భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్

image

గుంటూరు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. సహాయం కోసం 0863-2234014 నంబరులో సంప్రదించాలన్నారు. మూడు షిఫ్టుల్లో సిబ్బందిని విధులు నిర్వహించేలా నియమించామని ఆమె పేర్కొన్నారు. ప్రజలు సమస్యలు తెలియజేస్తే అధికారులు వెంటనే సహాయం అందిస్తారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

News September 13, 2025

గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్

image

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా వకుల్ జిందాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న సతీష్ కుమార్‌ను సత్యసాయి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. 2016 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో బాపట్ల ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం విజయనగరం జిల్లా నుంచి బదిలీపై గుంటూరుకు వస్తున్నారు. అక్కడ మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన, రోడ్డు ప్రమాదాల నివారణ, విద్యార్థులు, మహిళలకు రక్షణ వంటి చర్యలు విస్తృతంగా చేపట్టారు.