News February 27, 2026
నానో ఎరువులను ఎప్పుడు పిచికారీ చేయాలి?

వరిలో నానో యూరియా, నానో DAPలను కలిపి పిలకలు తొడిగే దశలో, చిరు పొట్ట దశలో పిచికారీ చేసుకోవచ్చు. కూరగాయలు, పప్పు దినుసుల పంటల్లో మొక్కల రెమ్మలు వచ్చే దశ, పూత దశలో స్ప్రే చేసుకోవచ్చు. పండ్ల తోటల్లో మామిడి పూతకు ముందు డిసెంబరు నెలలో నానో DAP స్ప్రే చేయడం వల్ల పూత పెరిగి మంచి దిగుబడులు వచ్చాయని రైతులు చెబుతున్నారు. కాబట్టి పండ్ల తోటల్లో పూతకు ముందు నానో DAPని పిచికారీ చేసి మంచి ఫలితాలను పొందవచ్చు.
Similar News
News February 27, 2026
విడాకుల పిటిషన్‌లో విజయ్‌పై భార్య ఆరోపణలు

విజయ్ ఓ నటితో కలిసి విదేశాల్లో పబ్లిక్ ఈవెంట్లకు హాజరయ్యేవారని ఆయన భార్య సంగీత <<19254560>>విడాకుల<<>> పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ ఫొటోలను సదరు నటి సోషల్ మీడియాలో షేర్ చేశారని తెలిపారు. ఆమెతో వివాహేతర సంబంధానికి ముగింపు పలుకుతానని తొలుత విజయ్ మాట ఇచ్చి సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని చెప్పారు. అతడి నిర్లక్ష్యం కారణంగా తాను ఒంటరినయ్యానని వెల్లడించారు. వివాహేతర సంబంధం ఇలాగే కొనసాగిస్తే ఆమె పేరు బయటపెడతానన్నారు.
News February 27, 2026
₹47,776 CRతో ఏపీ అక్రమ ప్రాజెక్టులు: TG

TG: కృష్ణా నీటిని అక్రమంగా తరలించేందుకు AP ₹47,776 CRతో అనుమతుల్లేని నిర్మాణాలు చేపడుతోందని KRMBకి TG ఫిర్యాదు చేసింది. కొత్త ప్రాజెక్టులతో పాటు పాతవాటి సామర్థ్యం పెంచుతోందని ఆరోపించింది. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు, హంద్రీ నీవా, గాలేరు నగరి, SRBC, తుంగభద్ర ప్రాజెక్టులకు శ్రీశైలం నుంచి నీటిని తరలించాలని చూస్తోందని విమర్శించింది. కేటాయింపు లేకున్నా 114TMCలు వాడుకోవాలని యత్నిస్తోందని పేర్కొంది.
News February 27, 2026
విజయ్-రష్మిక పెళ్లి.. రక్షిత్ శెట్టిని తెరపైకి తెస్తున్న నెటిజన్లు!

విజయ్-రష్మిక పెళ్లి చేసుకోవడంతో కన్నడ నెటిజన్లు రక్షిత్ శెట్టి పేరును తెరపైకి తెస్తున్నారు. ‘కిరిక్ పార్టీ’ సినిమాతో రష్మికను ఇండస్ట్రీకి పరిచయం చేసింది రక్షితేనని గుర్తు చేస్తున్నారు. వారిద్దరూ ప్రేమించుకుని 2017లో ఎంగేజ్‌మెంట్ చేసుకోగా.. రిలేషన్ కంటే కెరీర్ ఇంపార్టెంట్ అంటూ రష్మిక ఏడాదికే అతడిని వదిలేసిందని పోస్టులు చేస్తున్నారు. కాగా ఎంగేజ్‌మెంట్ సమయంలో రక్షిత్ వయసు 34, రష్మిక వయసు 21.


