News January 28, 2026

‘నాన్నా.. నేను విమానంలో అజిత్ పవార్‌తో వెళ్తున్నా’

image

విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తోపాటు ఫ్లైట్ అటెండెంట్‌ పింకీ మాలి కూడా చనిపోయారు. ముంబైకి చెందిన పింకీ చివరిసారిగా తన తండ్రి శివకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ‘నాన్నా నేను అజిత్ పవార్‌తో కలిసి విమానంలో బారామతి వెళ్తున్నా. అక్కడి నుంచి నాందేడ్ వెళ్లి మీతో రేపు మాట్లాడుతా’ అని చెప్పినట్లు శివ తెలిపారు. తన కూతురిని కోల్పోయానని, ఆమె మృతదేహాన్ని తెస్తే అంత్యక్రియలు నిర్వహిస్తానని కన్నీళ్లుపెట్టుకున్నారు.

Similar News

News February 14, 2026

గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలంటే..

image

నేటి కాలంలో గుడ్ కొలెస్ట్రాల్ (HDL) తగ్గి బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL) పెరుగుతోంది. దీంతో గుండెపోటు ముప్పు పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒమేగా-3 ఉండే చేపలు, ఆలివ్ ఆయిల్, బాదం, వాల్‌నట్, బ్లూబెర్రీ, బీన్స్ తినాలని సూచిస్తున్నారు. షుగర్, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. వారానికి కనీసం 150 నిమిషాలు ఎక్సర్‌సైజ్ చేయాలి. స్మోకింగ్ మానేయాలి. రోజుకు 7-8 గం. నిద్రపోవాలి.

News February 14, 2026

పిల్లల్లో ఈటింగ్ డిజార్డర్

image

కొందరు పిల్లలు ఎంత తింటున్నారో తెలియకుండా తినేస్తుంటారు. దీన్నే ఈటింగ్ డిజార్డర్ అంటారు. దీనివల్ల పిల్లల్లో జుట్టు రాలడం, అతిగా కోపాన్ని ప్రదర్శించడం, నలుగురితో కలవకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల ఆహారపు అలవాట్లను క్రమబద్ధం చేయడానికి కుటుంబం వారికి అండగా నిలవాలి. భయపెట్టడం, అలవాట్లను బలవంతంగా మార్చడానికి ప్రయత్నించకూడదు. మార్పు వచ్చే వరకు సహనంగా, మృదువుగా ప్రవర్తించాలి.

News February 14, 2026

ఓటుకు రూ.70వేలు.. 200+ ఓట్ల మెజారిటీతో గెలుపు

image

TG: రంగారెడ్డి(D) <<19125637>>మొయినాబాద్<<>> మున్సిపాలిటీలో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి ఓటుకు రూ.70వేలు, 25kgs బియ్యం పంచినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. నిన్న వెలువడిన ఫలితాల్లో ఆయన 200కి పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ ప్రాంతం రియల్టర్లకు గోల్డ్ మైన్‌గా మారడంతోనే గెలుపు కోసం రూ.7కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. స్వతంత్ర అభ్యర్థి కావడంతో ప్రధాన పార్టీల నుంచి ఆయనకు భారీ ఆఫర్ రావొచ్చనే టాక్ వినిపిస్తోంది.