News June 16, 2024
నాన్న జీవితమే నాకు స్ఫూర్తి: మంత్రి కొల్లు రవీంద్ర
“ఫాదర్స్ డే” సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర తన తండ్రి సుబ్బారావు జ్ఞాపకాలను పంచుకున్నారు. రైస్ మిల్ నిర్వహించే తన తండ్రి చాలా ప్రశాంతంగా ఉండేవారని రవీంద్ర చెప్పారు. అందరితో మంచిగా ఉండాలని, ఆప్యాయంగా పలకరించాలని చెప్పేవారన్నారు. తన తండ్రి మాటలే తనలో మార్పు తెచ్చాయన్నారు. ఆత్మవిశ్వాసం, ఆశావహ దృక్పథం ఆయన వద్ద నేర్చుకున్నానని రవీంద్ర చెప్పారు.
Similar News
News November 28, 2024
కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో జ్యోతిరావు పూలే వర్ధంతి
మచిలీపట్నంలోని కలెక్టరేట్ మీటింగ్ హాలులో గురువారం మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ డీకే బాలాజీ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల సముద్దరణకు ఆయన చూపిన మార్గం అనుసరణీయమన్నారు.
News November 28, 2024
కృష్ణా: ‘ఈనెల 30వరకు ఆ పని చేయకండి’
నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు గరిష్ఠంగా 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నెల 30 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని APSDMA హెచ్చరించింది. వాయుగుండం ప్రభావం ఉన్నందున జిల్లా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
News November 28, 2024
నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న మంత్రి నాదెండ్ల
మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి పర్యటన పామర్రులో ప్రారంభమై పెడన నియోజకవర్గంలోని గూడూరు, పెడన, బంటుమిల్లి మీదగా కృత్తివెన్ను చేరనుంది. పర్యటన సందర్భంగా జిల్లాలోని పలువురు రైతులను కలసి వారి వ్యవసాయ సమస్యలు తెలుసుకోనున్నారు. అనంతరం పలు వ్యవసాయ శాఖ కార్యాలయాలను సందర్శించునున్నారు.