News February 4, 2026
‘నాన్‌వెజ్’ విక్రయాలపై హైకోర్టు కీలక సూచనలు

TG: మాంసం, నాన్‌వెజ్ పదార్థాల విక్రయంపై సర్కారుకు హైకోర్టు కీలక సూచనలు చేసింది. గుడులు, విద్యా సంస్థలు, ఆస్పత్రుల నుంచి 100 మీటర్లలోపు మాంసం, నాన్‌వెజ్ పదార్థాలను అమ్మకుండా ఓ విధానం రూపొందించాలని సూచించింది. భక్తుల మనోభావాలు, శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని మార్గదర్శకాలు తయారు చేయాలంది. మాంసం దుకాణాల ప్రారంభానికి పోలీస్ స్టేషన్ నుంచి NOC పొందాలనే నిబంధన చేర్చాలని తెలిపింది.
Similar News
News February 4, 2026
ఇవాళ చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

AP: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం 10.40 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతల భేటీ కొనసాగనుంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఎంపిక, ఇతర కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
News February 4, 2026
క్రికెట్‌లో మార్పు.. ఆఖరి ఓవర్‌లో అవుటైనా..

క్రికెట్ రూల్స్ నిర్ణయించే MCC మరో కీలక మార్పు చేసింది. టెస్టుల్లో ఇంతకుముందు రోజులో చివరి ఓవర్‌లో ఏదైనా బంతికి బ్యాటర్ అవుటైతే అక్కడే ఆ రోజు ఆట ఆపివేసేవారు. మిగతా బంతులను బౌలర్ తర్వాతి రోజు వేసేవారు. తాజాగా MCC దాన్ని సవరించింది. బ్యాటర్ అవుటైనా ఆఖరి ఓవర్ పూర్తి చేస్తేనే ఆ రోజు ఆట ముగుస్తుందని తెలిపింది. వికెట్ పడగానే మ్యాచ్‌ను ఆపడం వల్ల ఆటలో డ్రామాను కోల్పోతున్నామని పేర్కొంది.
News February 4, 2026
వరిలో పాముపొడ(మాగుడు) తెగులు – నివారణ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గాలిలో తేమ వల్ల వరిలో పాముపొడ తెగులు ఉద్ధృతి పెరిగే అవకాశం ఉంది. వరి దుబ్బు చేసే దశలో ఇది వ్యాపిస్తుంది. వరి కాండం, ఆకులపై పాము పొడ లాంటి మచ్చలు కనిపిస్తాయి. తెగులు తీవ్రమైతే మొక్కలు ఎండి, తాలు గింజలు ఏర్పడతాయి. దీని నివారణకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 400ml హెక్సాకొనజోల్ 5 SP లేదా 400ml వాలిడామైసిన్ 3 SL లేదా 200ml ప్రోపికొనజోల్ 25% EC కలిపి పిచికారీ చేయాలి.


