News November 7, 2025
నాబార్డ్‌లో 91పోస్టులు

నాబార్డ్(NABARD) 91 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు రేపటి నుంచి ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, PG, MBA, CA, CS, LLB, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. వయసు 21- 30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలు రూ.150 చెల్లించాలి. వెబ్‌సైట్: www.nabard.org/
Similar News
News November 7, 2025
సూపర్ నేపియర్ గడ్డిని ఎలా పెంచాలి?

పశుగ్రాసం కొరతను తగ్గించి, పాడి పశువులకు ఎక్కువ పోషకాలను అందించే గడ్డి సూపర్ నేపియర్. దీన్ని చౌడు నేలలు మినహా ఆరుతడి కలిగిన అన్ని రకాల నేలల్లో పెంచవచ్చు. దీని సాగుకు ముందు దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల సూపర్ ఫాస్పేట్, 20kgల నత్రజని, 10kgల పొటాష్ వేయాలి. భూమిని మెత్తగా దున్ని, ప్రతీ 3 అడుగులకొక బోదెను ఏర్పాటు చేసి, ఎకరాకు 10 వేల కాండపు కణుపులు లేదా వేరు పిలకలు నాటుకోవాలి.
News November 7, 2025
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 50 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

పుణేలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దేహు రోడ్‌లో 50 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్‌తో పాటు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://munitionsindia.in/career/
News November 7, 2025
నైట్ షిఫ్ట్ ఒత్తిడి తట్టుకోలేక 10 మందిని చంపేసిన నర్సు!

నైట్ షిఫ్టులతో విసుగు చెందిన ఓ నర్సు (Male) హైడోస్ ఇంజెక్షన్లు ఇచ్చి 10 మందిని చంపిన ఘటన జర్మనీలోని వుయెర్సెలెన్ ఆసుపత్రిలో జరిగింది. పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఇలా చేసినట్లు అతడు ఒప్పుకోవడంతో కోర్టు జీవిత ఖైదు విధించింది. అతడు మరో 27 మందిని హత్యాయత్నం చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది. కాగా గతంలో నిల్స్ హెగెల్ అనే మరో నర్సు కూడా 85 మందిని హత్య చేశాడు.


