News January 2, 2026

నాభి రహస్యం – ఆరోగ్యానికి మూలం

image

విష్ణుమూర్తి నాభి నుంచి బ్రహ్మ ఉద్భవించడం సృష్టికి మూలం నాభి అని సూచిస్తుంది. తల్లి గర్భంలో శిశువుకు నాభి ద్వారానే జీవం అందుతుంది. మన శరీరంలోని 72 వేల నరాలు నాభి వద్దే అనుసంధానమై ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం నాభికి నూనె రాస్తే జీర్ణక్రియతో పాటు కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇది శరీరంలోని శక్తి కేంద్రాలను సమతుల్యం చేసి, సహజంగా రోగాలను నయం చేసే అద్భుతమైన ప్రక్రియ.

Similar News

News January 3, 2026

ఇందిరమ్మ ఇళ్లకూ ఫ్రీ కరెంట్: భట్టి విక్రమార్క

image

TG: కొత్తగా ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారికి కూడా ఉచిత కరెంట్ అందిస్తామని Dy.CM భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటికీ పథకం అందని అర్హులెవరైనా ఉంటే MPDO, మున్సిపల్ ఆఫీసులలో ఉండే ప్రజాపాలన అధికారులను సంప్రదించొచ్చని వెల్లడించారు. విద్యుత్తు వినియోగం 200 యూనిట్లు దాటితే మాత్రం పథకం వర్తించదని తేల్చి చెప్పారు. ఫ్రీ కరెంట్ ద్వారా రాష్ట్రంలో 50%పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పారు.

News January 3, 2026

ముంబై పోర్ట్ అథారిటీలో పోస్టులు

image

<>ముంబై <<>>పోర్ట్ అథారిటీ 10 ఇంటర్న్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు JAN 30 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. Jr.ప్రొఫెషనల్ ఇంటర్న్(హిందీ), Jr.ప్రొఫెషనల్ ఇంటర్న్ (మరాఠీ), Jr.ప్రొఫెషనల్ ఇంటర్న్(HR అసోసియేట్) పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ(ఇంగ్లిష్, హిందీ, మరాఠీ), డిప్లొమా, MBA(HR) ఉత్తీర్ణులు అర్హులు. గరిష్ఠ వయసు 35ఏళ్లు. నెలకు రూ.40వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: mumbaiport.gov.in

News January 3, 2026

ప్రాణం తీసిన క్యాబేజీ టేప్‌వార్మ్.. వండకముందు ఇలా చేయకపోతే డేంజరే!

image

క్యాబేజీలో ఉండే Tapeworm(బద్దెపురుగు) ప్రాణాంతకంగా మారడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో ఒక విద్యార్థిని వీటివల్ల బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌కు గురై మరణించారు. క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలకూర, వంకాయ వంటి కూరగాయలను సరిగ్గా కడగకుండా తింటే ఈ పురుగుల గుడ్లు రక్తంలో కలిసి మెదడుకు చేరతాయి. దీనివల్ల ఫిట్స్, తీవ్రమైన తలనొప్పి వస్తాయి. కూరగాయలను బాగా కడిగి పూర్తిగా ఉడికించి తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు.