News September 24, 2024

నామినేటేడ్ పోస్టుల్లో ఎంపికైన సిక్కోలు వాసులు వీరే..

image

ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన నామినేటేడ్ పోస్టుల భర్తీలో శ్రీకాకుళం నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. పలాస కాశీబుగ్గకు చెందిన మాజీ మున్సిపల్ ఛైర్మన్ బాబురావు రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా, బూర్జ మండలానికి చెందిన ఆనెపు రామకృష్ణ కార్పొరేషన్ పదవుల్లో మార్క్‌ఫెడ్ డైరెక్టర్‌గా, శ్రీకాకుళానికి చెందిన సీర రమణయ్య అర్బన్ ఫైనాన్స్& ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

Similar News

News September 29, 2024

అట్రాసిటీ చట్టం పగడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్ దినకరన్

image

SC, ST అట్రాసిటీ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకరన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం పౌర హక్కుల పరిరక్షణ, అత్యాచార నిరోధక చట్టం పై నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మహేశ్వర రెడ్డితో కలిసి మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న అట్రాసిటీ కేసులను పరిష్కరించాలని చెప్పారు. కమిటీలోని 8 మంది నూతన సభ్యుల నియామకానికి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించారు.

News September 28, 2024

జాతీయస్థాయి హాకీ పోటీలకు సిక్కోలు క్రీడాకారిణి

image

శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలస గ్రామానికి చెందిన చింతాడ చిన్ని జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 10 వరకు ఝార్ఖండ్ రాష్ట్రం రాంచి పట్టణంలో జరగనున్న 14వ హాకీ ఇండియా జూనియర్ మహిళా జాతీయ స్థాయి పోటీలకు ఏపీ తరపున పాల్గొంటానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆమెను అభినందిస్తున్నారు.

News September 28, 2024

శ్రీకాకుళం: కేరళ ముఖ్యమంత్రిని కలిసిన కేంద్ర మంత్రి

image

కేరళ నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు విస్తరిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, క్రీడలు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి వి.అబ్దురేహిమాన్ లతో చర్చలు జరిపారు. చిన్న విమానాశ్రయాలను మరింత బలోపేతం చేయడానికి, కేరళను అనుసంధానించేందుకు ఉడాన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు.