News December 6, 2025

నామినేషన్లు ప్రశాంతం: ఎస్పీ పరితోష్ పంకజ్

image

సంగారెడ్డి జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసిందని ఎస్పీ పరితోష్ పంకజ్ శుక్రవారం వెల్లడించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎవరైనా అక్రమంగా మద్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

Similar News

News December 6, 2025

ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి: కామారెడ్డి కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ సర్పంచి, వార్డు సభ్యులకు జరుగుతున్న ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు వివరించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొదటి విడత రిటర్నింగ్ అధికారులు, సహయ జిల్లా ఎన్నికల అధికారులు ఎంపీడీవోలు, తహశీల్దార్‌లతో మాట్లాడారు. ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు.

News December 6, 2025

నర్సీపట్నంలో రేపు నవోదయ మోడల్ టెస్ట్

image

PRTU నర్సీపట్నం ఆధ్వర్యంలో నవోదయ మోడల్ టెస్ట్ ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు PRTU జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ తెలిపారు. శారద నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మోడల్ టెస్ట్ పరీక్షలు ఉంటాయన్నారు. నవోదయ పరీక్షలు రాసే విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. టెస్టులో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విజేతలకు బహుమతి ప్రదానం, ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు.

News December 6, 2025

సెమీస్‌లో పాలమూరు అండర్-14 క్రికెట్ జట్టు

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భద్రాచలంలో జరుగుతున్న అండర్-14 క్రికెట్ పోటీల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. పాలమూరు జట్టు వరంగల్‌, అదిలాబాద్‌, మెదక్‌ జట్లపై వరుస విజయాలు సాధించినట్లు కోచ్‌ సురేశ్ తెలిపారు. జిల్లా జట్టు సెమీస్‌ చేరడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తూ, రాష్ట్రస్థాయిలో విజేతగా నిలవాలని ఆకాంక్షించారు.