News November 30, 2025
నామినేషన్ల ప్రక్రియలో పొరపాట్లకు తావివ్వొద్దు: కలెక్టర్

నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా ఎస్పీ కే.నరసింహతో కలిసి నాగారం మండల కేంద్రంలోని, తిరుమలగిరి మండలం తొండలోని నామినేషన్ కేంద్రాలను సందర్శించి, చివరి రోజు ప్రక్రియ గురించి తెలుసుకున్నారు.
Similar News
News December 1, 2025
పార్లమెంట్‌లో నినదించి.. ఈ సమస్యలు పరిష్కరించండి సార్.!

హైదరాబాద్-అమరావతి ఎంప్లాయిస్ రైలుతో పాటు మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నడికుడి జంక్షన్‌లో స్టాప్‌లు మంజూరు చేయాలని ప్రజలు MP శ్రీకృష్ణదేవరాయలను కోరుతున్నారు. ఆయన కృషి ఫలితంగానే వందే భారత్ పిడుగురాళ్లలో ఆగడానికి అధికారులు అంగీకరించారు. జాతీయ రహదారుల పనుల వేగవంతం, కేంద్ర పథకాల అమలులో MP చొరవను ప్రజలు అభినందిస్తున్నారు. నేడు పార్లమెంట్‌లో జిల్లా సమస్యలపై మాట్లాడి సమస్యలు పరిష్కరించాలన్నారు.
News December 1, 2025
జగన్ పర్యటనకు గంజాయి బ్యాచ్‌ని తెచ్చారు: కోటంరెడ్డి

ఇటీవల జగన్ నెల్లూరుకు వచ్చినప్పుడు కామాక్షమ్మ వందలాది మంది గంజాయి బ్యాచ్‌ని తీసుకువచ్చింది నిజమా? కాదా? అని నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ‘పెంచలయ్య మరణానికి నేను, నా తమ్ముడు, కార్పొరేటర్ శ్రీనివాసులు కారణమని సీపీఎం చెబితే ఆ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా. కామాక్షమ్మ నుంచి ఆనం విజయకుమార్ రెడ్డి రూ.5లక్షలు తీసుకున్నారనే ప్రచారం ఉంది’ అని ఆయన చెప్పారు.
News December 1, 2025
ఖమ్మం: నేటి నుంచి కొత్త వైన్స్.. ఎన్నికల జోష్

ఖమ్మం జిల్లాలో ఈరోజు నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ కింద 116 వైన్స్ ప్రారంభం కానున్నాయి. అయితే, జనావాసాల్లో షాపుల ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జమ్మిబండ వైన్స్ రద్దు కాగా, మరికొన్నింటిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరొకవైపు ఈ నెలలో3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో, వైన్స్ వ్యాపారులు తొలి నెలలోనే అమ్మకాలు జోరుగా సాగనున్నాయి.


