News January 28, 2026

నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా జిల్లాలోని మున్సిపాలిటీలలో నామినేషన్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకి తెలిపారు. మహబూబ్‌నగర్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలకు సంబంధించి బుధవారం నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు. నామినేషన్ దాఖలు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 19, 2026

MBNR: రంజాన్.. ఉపవాస దీక్షలు ప్రారంభం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రంజాన్‌ శోభ సంతరించుకుంది. పవిత్రమైన రంజాన్ మాసం నేపథ్యంలో నేటి నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. నిన్న నెలవంక కనిపించడంతో ముస్లింలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మసీదులను విద్యుద్వీపాలతో అలంకరించారు. నెలరోజులపాటు తరావీ నమాజ్‌లు చేయనున్నారు. ఇప్పటికే రంజాన్‌ నేపథ్యంలో ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో వెసులుబాటును కల్పిస్తూ.. GOVT ఉత్తర్వులు జారీ చేసింది.

News February 19, 2026

పాలమూరు: మోడల్ స్కూల్.. అప్లై చేసుకోండి

image

మహబూబ్ నగర్ (D) గండీడ్ (M) వెన్నాచేడ్ ఆదర్శ పాఠశాలలో (మోడల్ స్కూల్) చేరెందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాయిస్ ఫాతిమా ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీలు ఉన్నాయని, ఈనెల 28లోగా https://tgms.telangana.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రవేశ పరీక్ష: ఏప్రిల్ 19
SHARE IT

News February 17, 2026

జడ్చర్ల: ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. యువకుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గంగాపూర్ గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో వాహనంపై ప్రయాణిస్తున్న మిడ్జిల్ మండలం రాణి పేట గ్రామానికి చెందిన బోయ శివ(26) అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తి రజని (26) కి తీవ్ర గాయాలు కాగా 108లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.