News October 9, 2025

నామినేషన్ కోసం కావలసిన పత్రాలు ఇవే

image

స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత ఎంపీటీసీ,జెడ్పీటీసీ నామినేషన్ దాఖలు ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ తో పాటు ఓటర్ ఐడీ,3 పాస్ పోర్ట్ పోటోలు,ఎన్నికల డిపాజిట్ రసీదు సమర్పించాలి. పార్టీకు సంబంధించిన అభ్యర్థులు బి.ఫామ్ జతచేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ స్థానాలకు పోటీ చేసేవారు కుల దృవపత్రంపై గజిటెడ్ సంతకం చేయించి అటాచ్ చేయాలి. కొత్త బ్యాంక్ ఖాతా ఆర్.ఓ కు సమర్పించాలి.

Similar News

News October 9, 2025

త్రిపురాంతకం వద్ద యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

త్రిపురాంతకంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేడపి సమీపంలోని మానేపల్లి రహదారిలో ద్విచక్ర వాహనం – బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 9, 2025

ADB: కోర్టు తీర్పు+నోటిఫికేషన్= ఉత్కంఠ

image

స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. బుధవారం హైకోర్టు తీర్పు వస్తుందని అందరూ ఆశగా ఎదురు చూశారు. అది కాస్త గురువారానికి వాయిదా పడటంతో ఉమ్మడి జిల్లా ఆశావహుల్లో ఆందోళన కొనసాగుతోంది. రిజర్వేషన్లు ఏ స్థాయిలో అమలవుతాయి దానిని బట్టి నామినేషన్లు వేద్దామని భావించారు. నేడు ఓవైపు తీర్పు రావడం, మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఏం జరుగుతుందోనని ఆంతటా ఆసక్తి నెలకొంది.

News October 9, 2025

వరంగల్: రైలు బాత్ రూంలో ప్రయాణికుడి మృతి

image

కాజీపేట సిద్ధార్థ నగర్ చెందిన మరెల్లి సుజిత్ గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు బాత్ రూంలో గుండె పోటుతో మరణించాడు. పోలీసుల వివరాల ప్రకారం.. HYD నుంచి వెళ్తుండగా జనగామ సమీపంలో S2 బోగిలో మరుగుదొడ్డి వెళ్లాడు. మరుగుదొడ్డిలో సుజిత్ పడిపోయి ఉండటంతో తోటి ప్రయాణికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి కాజీపేటలో బాధిత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.