News February 8, 2025
నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి

కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్స్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగులు, పట్టభద్రులు గత బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి మోసపూరిత వాగ్దానాలకు బలయ్యారన్నారు.
Similar News
News September 16, 2025
ఏడేళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడుకి 20 ఏళ్ల శిక్ష: ఎస్పీ

పెద్ద శంకరంపేట మండలంలో ఏడేళ్ల బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడు మోహన్‌కు 20 ఏళ్ల శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. బాలికకు పరిహారంగా రూ. 3 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసులో శిక్ష పడేందుకు కృషి చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
News September 16, 2025
ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

TG: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్(TANHA) ప్రకటించింది. 323 ఆసుపత్రులకు ₹1,400 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని చెప్పింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామంది. మరోవైపు ఇటీవల ఇచ్చిన హామీ మేరకు ₹100 కోట్లు విడుదల చేశామని వైద్య వర్గాలు తెలిపాయి.
News September 16, 2025
1,543 ఇంజినీరింగ్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1,543 పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు. ఇంజినీరింగ్‌లో కనీసం 55శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పని అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 29ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.